రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోవాలా

Published: Saturday May 15, 2021

కొవిడ్‌ చికిత్స కోసం అంబులెన్సుల్లో హైదరాబాద్‌ వచ్చే పొరుగు రాష్ట్రాల రోగులను సరిహద్దుల్లో నిలిపివేయడంపై హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. à°ˆ విషయమై తామిచ్చిన స్పష్టమైన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడింది. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పొరుగు రాష్ట్రాల నుంచి... ముఖ్యంగా ఏపీ నుంచి అంబులెన్సులలో వచ్చే రోగులను సరిహద్దులలో నిలిపివేయడానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ సీఎస్‌ ఈనెల 11à°¨ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది. కొవిడ్‌కు మెరుగైన చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంబులెన్సులలో రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని సరిహద్దుల్లో అడ్డుకున్న సంగతి తెలిసిందే. à°ˆ పరిణామం à°—à°¤ కొన్ని రోజులుగా ఉభయ రాష్ట్రాల మధ్య పెద్ద సమస్యగా మారింది. దీనికి సంబంధించి తెలంగాణ సీఎస్‌ ఇచ్చిన జీవోను హైకోర్టు పక్కన పెట్టడంతో... ప్రస్తుతానికి పొరుగు రాష్ట్రాల రోగులు హైదరాబాద్‌ రావడానికి మార్గం సుగమం అయ్యింది. 

 

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలాంటిది దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ జారీచేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పొరుగు రాష్ట్రాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగులను అడ్డుకోవద్దని తాము ఆదేశాలిచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి జీవో జారీచేయడమేంటని ప్రశ్నించింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి రిస్కుతో వచ్చే రోగుల హక్కులను మీరెలా ఉల్లంఘిస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగానికి, కేంద్ర మార్గదర్శకాలకు లోబడే ఉండాలని తేల్చిచెప్పింది. కోర్టు ఉత్తర్వులు అందేవరకూ వేచి చూడకుండా తక్షణమే à°ˆ ఆదేశాలను అమలుచేసి రోగులు ఆస్పత్రులకు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని తేల్చిచెప్పింది. à°ˆ వ్యాజ్యంలో మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీచేసింది. à°† కౌంటర్లకు వారంలోగా బదులివ్వాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.  కోర్టు తదుపరి విచారణను జూన్‌ 17à°•à°¿ వాయిదా వేసింది. చికిత్స కోసం వచ్చే రోగులను అడ్డుకునేందుకు జీవో/మార్గదర్శకాలు/సర్క్యులర్‌ ఏ రూపంలోనూ ఉత్తర్వులు జారీచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు హైకోర్టు సీజే హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.