ఇటు కరోనా పీడ.. అటు జగన్‌ రెడ్డి వివక్ష

Published: Saturday May 15, 2021

కరోనా విలయాన్ని తట్టుకోవడానికి వైద్యం చేయిచే దిక్కే లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి,  టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పడకలు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు దొరక్క వందల మంది మరణిస్తున్నారని, పలుకుబడి లేని సామాన్యులు అమానవీయ పరిస్ధితుల్లో మరణిస్తున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. à°’à°• పక్క కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంటే.. మరో పక్క జగన్‌ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష ముస్లిం మైనారిటీలను తీవ్రంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రంజాన్‌ సందర్భంగా టీడీపీకి చెందిన ముస్లిం నేతలతో శుక్రవారం ఆయన ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తగిన జాగ్రత్తలతో భౌతిక దూరం పాటిస్తూ పండుగ జరుపుకొన్నందుకు అభినందించారు. ‘కోరి తెచ్చుకున్న ప్రభుత్వం తమను మోసం చేసిందని మైనారిటీలు కలత చెందుతున్నారు. 

 

 

టీడీపీ ప్రభుత్వం పెట్టిన పఽథకాలన్నీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. నోరు తెరిచి ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారు. కాలి à°•à°¿à°‚à°¦ చెప్పులా తొక్కి ఉంచుతున్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగలను బాధలతో చేసుకోవాల్సి వస్తోంది. ప్రచారం కొండంత ఉన్నా అమలు గోరంత కూడా లేదు. దుల్హన్‌ పథకం à°•à°¿à°‚à°¦ పేద ముస్లిం కుటుంబాల వారికి రూ.50 వేల వంతున కేవలం ఒక్క ఏడాదిలోనే ఎనభై వేల మందికి సాయం చేశాం. తానొస్తే à°† మొత్తాన్ని రూ.లక్ష చేస్తానని గప్పాలు కొట్టిన జగన్‌ రెడ్డి à°† పఽథకాన్ని పూర్తిగా ఎత్తేశాడు. à°ˆ రెండేళ్లలో ఎవరికీ పైసా సాయం చేయలేదు. హజ్‌ యాత్రకు ప్రభుత్వపరంగా చేసే సాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇమాంలు, మౌజంలకు నెలసరి వేతనాన్ని రూ. 15 వేలు చేస్తానని చెప్పి మోసం చేశారు. పండుగ ఆనందంగా జరుపుకోవాలని మేం ఇచ్చిన రంజాన్‌ తోఫాను నిలిపివేశారు. మసీదుల సుందరీకరణకు ఇచ్చే నిధులు ఎత్తివేశారు. ముస్లిం నిరుద్యోగ యువతకు టీడీపీ ప్రభుత్వం రూ.3 లక్షలు బ్యాంకు లింకేజి ఇచ్చి అందులో రూ.లక్ష సబ్సిడీగా ఇచ్చింది. దీనిని పొందడానికి వయో పరిమితిని 55 ఏళ్లకు పెంచింది. ఏటా పది వేల మంది యువత దీని à°•à°¿à°‚à°¦ స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకునేవారు. దానినీ ఎత్తివేశారు. ఇల్లు, దుకాణం కలిపి పెట్టుకునే దుకాణ్‌-మకాన్‌ పథకాన్ని మనం అమలు చేస్తే à°ˆ ప్రభుత్వం రాగానే ఎత్తివేసింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే ముస్లిం విద్యార్థులకు రూ.10 నుంచి రూ.15 లక్షల వరకూ సాయం చేశాం.

 à°®à°¸à±€à°¦à±à°²à±, శాదీఖానాల నిర్మాణం నిలిపివేశారు. అత్యున్నతమైన మండలి ఛైర్మన్‌ పదవిని ముస్లిం వర్గాల ప్రతినిధికి ఇస్తే వైసీపీ నేతలు ఆయన్ను చెప్పలేని భాషలో దూషించారు’ అని చంద్రబాబు à°ˆ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలీసుల వేధింపులు భరించలేక అబ్దుల్‌ సలాం అనే సామాన్యుడు తన కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటే ఒక్కరిపై కూడా చర్య లేదని, అనేక చోట్ల ముస్లిం మైనారిటీల పరిస్ధితి ఇదే మాదిరిగా ఉందని అన్నారు. టీడీపీ హయాంలో ముస్లిం మైనారిటీలు గుండెలపై చేయి వేసుకుని భద్రంగా నిద్ర పోగలిగే పరిస్థితి ఉండేదని చెప్పారు. వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి మంచి ప్రణాళికతో ముందుకు వస్తామని తెలిపారు.