ఏపీలో కరోనా విజృంభణ

Published: Sunday May 16, 2021

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. à°—à°¡à°¿à°šà°¿à°¨ వారంలోనే ఏపీలో  పాజిటివ్‌ కేసుల తీవ్రత 30.3శాతానికి పెరిగిందన్నారు. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఏపీ సహా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఆయా రాష్ర్టాల ఆరోగ్య మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో వెబినార్‌ వేదికగా ఆయన సమీక్షించారు. ఏపీ నుంచి ఎవరూ à°ˆ భేటీలో పాల్గొనలేదని à°† శాఖ వెల్లడించింది. ఏపీలో కరోనా వైరస్‌ తీవ్రంగా ఉందని à°ˆ సందర్భంగా హర్షవర్ధన్‌ వెల్లడించారు. ‘చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కట్టడికి కఠినంగా వ్యవహరించాలి. బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ, ఔషధాలు అందుబాటులో ఉంచాలి. ప్రాణనష్టం నియంత్రణే లక్ష్యంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి’ అని ఏపీ సర్కారుకు ఆయన సూచించారు.  కేంద్రం పంపిస్తున్న వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో కరోనా పరిస్థితులపై సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఇద్దరు, ముగ్గురు సభ్యులతో అధికారుల బృందాన్ని నియమించుకోవాలని సూచించారు.  ఇప్పటిదాకా 18 కోట్ల డోసులను దేశప్రజలకు అందించగా, à°† సంఖ్య వచ్చే జూలై నాటికి 51.6 కోట్లకు చేరుకోనుందని చెప్పారు.