అక్కడే వైద్య పరీక్షలు చేయించండి; ధర్మాసనం స్పష్టం

Published: Tuesday May 18, 2021

రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రీ కాదు... ప్రైవేటు ఆస్పత్రి కూడా కాదు! సీఐడీ అధికారులు అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామను ఆస్పత్రికి తరలించాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ... ఆదివారం ఆయనను సీఐడీ అధికారులు జైలుకు పంపిన సంగతి తెలిసిందే. రఘురామ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌తోపాటు తన తండ్రిని హింసించారంటూ ఆయన కుమారుడు భరత్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌తో కూడిన వెకేషన్‌ ధర్మాసనం విచారణ జరిపి à°ˆ ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామను ఏ ఆస్పత్రికి తరలించాలన్న అంశంపై ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రికి వద్దు’ అని ఎంపీ తరఫు న్యాయవాదులు... ‘ప్రైవేటు ఆస్పత్రికి అసలే వద్దు’ అని ప్రభుత్వ తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. మధ్యలో మంగళగిరిలోని ఎయిమ్స్‌, విశాఖలోని ‘నేవీ ఆస్పత్రి’ ప్రస్తావన కూడా వచ్చినా... చివరికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలని ధర్మాసనం ఆదేశించింది. 

 

రఘురామరాజు సోమవారమే సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి చేరేలా ఏపీ చీఫ్‌ సెక్రటరీ చూడాలని స్పష్టం చేసింది. అలాగే... à°ˆ ఆదేశాలు వెంటనే అమలయ్యేలా వీటిని ఏపీ ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులతోపాటు ఆర్మీ ఆస్పత్రి చీఫ్‌కు à°ˆ-మెయిల్‌ ద్వారా పంపించాలని కోర్టు సిబ్బందికి సూచించింది. ‘‘రఘురామకు  న్యాయాధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అందుకు తెలంగాణ హైకోర్టు à°’à°•  న్యాయాధికారిని నామినేట్‌ చేయాలి. ఆర్మీ ఆస్పత్రి అధిపతి నియమించే ముగ్గురు డాక్టర్లతో కూడిన మెడికల్‌ బోర్డు à°ˆ పరీక్షలు నిర్వహించాలి. వైద్య పరీక్షల ప్రక్రియను వీడియోలో చిత్రీకరించి... తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు సీల్డ్‌ కవర్‌లో అందించాలి. అది అక్కడి నుంచి మాకు అందుతుంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు రఘురామకృష్ణంరాజును ఆర్మీ ఆస్పత్రిలో వైద్య సంరక్షణలో ఉంచాలి. à°ˆ కాలాన్ని జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లు పరిగణించాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వైద్యానికి అయ్యే ఖర్చులను రఘురామ రాజు తానే భరించాలని తెలిపింది. ఇక... ‘వై’ కేటగిరీ భద్రత ఉన్న రఘురామరాజుకు రక్షణగా ఉన్న జవాన్లు ఆస్పత్రి వరకు ఎస్కార్ట్‌ ఇవ్వాలని,  వైద్య పరీక్షల సమయంలో అక్కడ ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే... వివిధ దశల్లో మేజిస్ట్రేటు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతోపాటు ఇటీవల రఘురామరాజుకు బైపాస్‌ సర్జరీ జరగడం, మెడికల్‌ రిపోర్టులో పేర్కొన్న గాయాలు, కేసులో వాస్తవాలు, ఇతర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని à°ˆ ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

 

ప్రస్తుత దశలో ఎఫ్‌ఐఆర్‌లో రఘురామ రాజుపై చేసిన ఆరోపణల మెరిట్స్‌లోకి వెళ్లడానికి నిరాకరిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. ‘‘గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, రమేశ్‌ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కస్టడీలో తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీని ప్రయోగించారని రఘురామరాజు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంది. à°† తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నేతృత్వంలోని మెడికల్‌ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. à°† మెడికల్‌ రిపోర్టును పరిశీలించాం. రెండు పిటిషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం à°ˆ నెల 19లోగా సమాధానం ఇవ్వాలి’’ అని ఆదేశించింది. సమాధానపు పత్రాలను పిటిషనర్లకు అందించాలని పేర్కొంది. తదుపరి విచారణను 21à°•à°¿ వాయిదా వేసింది.