గుజరాత్‌లో తీరం దాటిన పెను తుఫాను

Published: Wednesday May 19, 2021

తౌక్తే పెను తుఫాను గుజరాత్‌లో విధ్వంసం సృష్టించింది. à°† రాష్ట్రంలో ఏడుగురిని బలితీసుకుంది. à°† రాష్ట్రంలో 16,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 40,000 కుపైగా చెట్లు, వెయ్యికిపైగా విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. 2,437 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.  159 రహదారులు ధ్వంసమయ్యాయి. 16 కొవిడ్‌ ఆస్పత్రులకూ విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారానికి వాటిలో 12 ఆస్పత్రులకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధురించగలిగారు. మరో నాలుగు ఆస్పత్రుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్‌ అందిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి గుజరాత్‌లోని సౌరాష్ట్ర రీజియన్‌ వద్ద డయ్యూ, ఉనా మధ్య తౌక్తే తీరం దాటినట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు తెలిపింది. అనంతరం అది  బలహీనపడి మంగళవారం తుఫానుగా కొనసాగుతున్నట్టు పేర్కొంది. 

 

రాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే  అవకాశం ఉందని అంచనా వేసింది. గాలుల తీవ్రత గంటకు 105-115 కిలోమీటర్లకు తగ్గిందని, ఇంకా 45-55 కిలోమీటర్లకు తగ్గొచ్చని పేర్కొంది. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురు, రాజ్‌కోట్‌, పటాన్‌, అమ్రేలి, వల్సద్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారని అధికారులు తెలిపారు. 16,500 ఇళ్లు ధ్వంసమయ్యాయని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ రూపానీ చెప్పారు. ముందుగానే సుమారు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.ఇప్పటికే కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో తౌక్తే విధ్వంసం సృష్టించింది.  

 

మహారాష్ట్రలోని ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో లంగర్లు తెగి కొట్టుకుపోయిన ఓఎన్‌జీసీకి చెందిన మూడు ఓడలు(బార్బ్‌లు) నుంచి  సిబ్బందిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. వీటి నుంచి ఇప్పటి వరకు 317 మందిని నేవీ కాపాడింది. గుజరాత్‌లోని వేరవల్‌ హార్బర్‌ వద్ద యాంకర్లు తెగిపోవడంతో మూడు పడవలు మంగళవారం సముద్రంలోకి కొట్టుకుపోగా, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది చేతక్‌ హెలికాప్టర్ల ద్వారా వాటిలో ఉన్న మొత్తం 16 మంది మత్స్యకారులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్‌ హవేలీ, డామన్‌, డయ్యూల్లో తౌక్తే పెను తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సదుపాయాన్ని కల్పించామని టెలికాం విభాగం ప్రకటించింది.  

 

కేంద్రమంత్రి అమిత్‌à°·à°¾ గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ సీఎంలు విజయ్‌ రూపాని, ఉద్ధవ్‌, అశోక్‌ గెహ్లోత్‌కు ఫోన్‌ చేసి తుఫాను పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని హామీ ఇచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి.