కొత్త మార్గదర్శకాల్లో కేంద్రం హెచ్చరిక

Published: Friday May 21, 2021

 à°•à°°à±‹à°¨à°¾ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వారి ముక్కు, నోటి నుంచి వచ్చే సూక్ష్మతుంపర్లు(ఏరోసాల్స్‌) 30 అడుగుల దాకా వ్యాపిస్తాయని... కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కొవిడ్‌పై పోరాటానికి సంబంధించి సులువుగా పాటించగల కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయరాఘవన్‌ కార్యాలయం జారీచేసింది. ‘స్టాప్‌ à°¦ ట్రాన్స్‌మిషన్‌.. క్రష్‌ à°¦ పాండెమిక్‌’ పేరిట విడుదల చేసిన à°† మార్గదర్శకాల్లో.. డబుల్‌ మాస్కింగ్‌, మెరుగైన వాయుప్రసరణ వ్యవస్థ, భౌతిక దూరం పాటించడం వంటి సూచనలున్నాయి.

 

ముఖ్యంగా.. సరైన వాయుప్రసరణ వ్యవస్థ ద్వారా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని అందులో పేర్కొన్నారు. తలుపులు, కిటికీలు అన్నీ మూసేసి ఏసీ వేసుకుంటే.. వైరస్‌ à°† గదిలోనే పరిభ్రమిస్తుందని, తద్వారా à°† గదిలో ఉన్నవారికి వైరస్‌ à°’à°•à°°à°¿ నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ముప్పు ఎక్కువవుతుందని హెచ్చరించారు. వైరస్‌ సోకినా ఎలాంటి లక్షణాలూ లేనివారు అలాంటి గదుల్లో వైరస్‌ వాహకులుగా మారి వ్యాప్తి చేస్తారని గుర్తుంచుకోవాలన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి నోరు, ముక్కు నుంచి వెలువడే పెద్ద తుంపర్లు (డ్రాప్‌లెట్స్‌) ఆరడుగుల లోపే పడతాయని.. కానీ, సూక్ష్మతుంపర్లు మాత్రం 30 అడుగుల దాకా వ్యాపిస్తాయని హెచ్చరించారు. ఇంట్లో ఏదైనా చెడు/ఘాటు వాసన వస్తే తలుపులు, కిటికీలు తెరవగానే à°† వాసన పోతుంది. అచ్చం అలాగే కిటికీలు, తలుపులు తెరిచిపెట్టడం ద్వారా వైర్‌సలు పెద్ద సంఖ్యలో ఇంట్లో చేరడాన్ని నివారించవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇల్లు/కార్యాలయం వంటి చోట్ల కీలకమైన ప్రాంతాల్లో ఫ్యాన్లను అమర్చడం, కొద్దిగా కిటికీలు తెరవడం వంటివి చేయడం ద్వార బయటిగాలి లోపలికి వచ్చి ఇండోర్‌లో వాయునాణ్యత మెరుగవుతుందన్నారు.

 

అలాగే.. ప్రజలంతా రెండు లేయర్లున్న మాస్కులను లేదా ఎన్‌95 మాస్కులను ధరించాలని, వాటివల్ల గరిష్ఠ స్థాయి రక్షణ లభిస్తుందని వివరించారు. లేదా సర్జికల్‌ మాస్కు ధరించి, దానిపై వస్త్రంతో తయారైన మాస్క్‌ (డబుల్‌ మాస్కింగ్‌) ధరించాలని సూచించారు. సర్జికల్‌ మాస్కు లేనివారు రెండు కాటన్‌ మాస్కులనైనా కలిపి ధరించవచ్చన్నారు. ‘‘మామూలుగా అయితే సర్జికల్‌ మాస్కును ఒకసారి మాత్రమే వాడగలం. కానీ దానిపై వస్త్రంతో చేసిన మాస్కు పెట్టుకోవడం వల్ల వారం పాటు లేదా ఐదుసార్లు ధరించవచ్చు. కాకపోతే.. à°† 7రోజులూ ఇంటికి వచ్చాక సర్జికల్‌ మాస్కును ఎండలో ఉంచాలి’’ అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోకి ఎవరు వచ్చినా వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయాలని.. ఇందుకు ఆశా/అంగన్‌వాడీ/ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆయా కార్యకర్తలందరూ టీకాలు వేయించుకున్నాకూడా.. వారికి ప్రభుత్వం ఎన్‌95 మాస్కులు ఇవ్వాలని పేర్కొన్నారు.