బంగాళాఖాతంలో అల్పపీడనం

Published: Sunday May 23, 2021

 à°¤à±Œà°•à±à°¤à±‡ విధ్వంసం నుంచి కోలుకోక ముందే.. బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాను ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిసా, పశ్చిమ బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి ఆదివారం వాయుగుండంగా మారనుందని, సోమవారం తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను మరింత బలపడి 25 నాటికి అతి తీవ్ర తుపానుగా మారవచ్చని సూచించింది. à°ˆ తుపానుకు ‘యాస్‌’à°—à°¾ పేరు పెట్టనున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని ప్రకటించింది.

 

తుపాను కారణంగా 21రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హౌరా-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రె్‌సను ఈనెల 25,26,27à°¨, హైదరాబాద్‌-హౌరా ఎక్స్‌ప్రె్‌సను ఈనెల 24,25,26à°¨, గౌహతి-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రె్‌సను 26à°¨, హౌరా-వాస్కోడగామ ఎక్స్‌ప్రెస్‌, వాస్కోడగామ-హౌరా ఎక్స్‌ప్రె్‌సను 25à°¨ రద్దు చేశామని తెలిపింది. మైసూర్‌-హౌరా ఎక్స్‌ప్రె్‌సను 23à°¨, హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌సను 25à°¨, గౌహతి-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌సను 24à°¨, అగర్తలా-బెంగళూరు, బెంగళూరు-అగర్తలా ఎక్స్‌ప్రె్‌సను 25à°¨, విల్లుపురం-పురాలియా ఎక్స్‌ప్రె్‌సను 26à°¨, విల్లుపురం-ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌సను 25à°¨, ఖరగ్‌పూర్‌-విల్లుపురం ఎక్స్‌ప్రె్‌సను 27à°¨, ఎర్నాకుళం-హౌరా ఎక్స్‌ప్రె్‌సను 24à°¨, యశ్వంత్‌పూర్‌-భువనేశ్వర్‌ రైలును 24à°¨, చెన్నై సెంట్రల్‌-పూరి రైలును 24à°¨, బెంగళూరు-గౌహతి రైలును 27, 28à°¨, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌ రైలును 26à°¨, న్యూటిన్‌సుకియా-బెంగళూరు రైలును 28à°¨, యశ్వంత్‌పూర్‌-భగల్‌పూర్‌ రైలును 29à°¨, యశ్వంత్‌పూర్‌-కామాఖ్య రైలును 29à°¨ రద్దు చేశారు.