నల్లగొండలో విద్యుత్తు సిబ్బందిపై పోలీసుల ప్రతాపం

Published: Sunday May 23, 2021

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో లాక్‌డౌన్‌ ఒక్కసారిగా కట్టుదిట్టమైంది. ఇప్పటిదాకా అమలైన లాక్‌డౌన్‌ à°’à°• ఎత్తు.. ఇప్పటినుంచి అమలయ్యేది à°’à°• ఎత్తు అన్నట్లుగా కనిపించింది. à°—à°¡à°šà°¿à°¨ పది రోజుల్లో లాక్‌డౌన్‌ అమలైన తీరు పట్ల సీఎం కేసీఆర్‌ à°’à°•à°¿à°‚à°¤ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇకపై మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశించడంతో పోలీసులు à°† మేరకు చర్యలు చేపట్టారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి గ్రామాల దాకా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా అమలుకు చర్యలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలు దాటగానే చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ మొదలు పెట్టారు. అత్యవసర సేవలకు సంబంధించిన వారిని, అనుమతి పాస్‌లు ఉన్నవారిని మినహా.. ఇతరులెవరినీ రోడ్లపైకి అనుమతించలేదు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేశారు. ప్రధాన రహదారులతోపాటు కాలనీల్లోనూ గస్తీ నిర్వహించారు. మినహాయింపు సమయం ముగిశాక కూడా తెరిచి ఉంచిన దుకాణాలు, వ్యాపార సముదాయాలకు జరిమానాలు విధించారు. వ్యాక్సినేషన్‌ కోసం వెళ్లేవారి సమాచారాన్ని పరిశీలించిన తరువాతే వారిని అనుమతించారు. 

 

మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి.. వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఎక్కడికక్కడ పోలీసు అధికారులు, ఎస్పీలు లాక్‌డౌన్‌ అమలును పర్యవేక్షించారు. పలు చోట్ల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసే క్రమంలో పలు వివాదాలూ తలెత్తాయి. పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా, వెళ్లి వస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. నల్లగొండలో విద్యుత్తు శాఖ ఉద్యోగుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రెండు శాఖల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్ది జోక్యం చేసుకునేదాకా వెళ్లింది.   à°«à±à°¡à±‌ డెలివరీ వాహనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. పోలీసులు అడ్డుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు వలంటీర్లను నియమించి లాక్‌డౌన్‌ అమలయ్యేలా చూస్తున్నారు. 

 

రాష్ట్ర రాజధానిలోని ట్రై కమిషనరేట్‌ పరిధిలో శనివారం డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సీపీ మహేష్‌ భగవత్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను ఆపి, వివరాలు అడిగితెలసుకున్నారు. మల్కాజిగిరి డివిజన్‌లలో పలు చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. సరైన కారణాలు లేకుండా ఇష్టానుసారంగా రోడ్డుపైకి వచ్చిన వాహనాలను సీజ్‌ చేయించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 1000లు జరిమానాలు వెశారు. à°ˆ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వ్యాపారస్తులు ఉదయం 9.30 à°—à°‚à°Ÿà°² వరకే కొనుగోలుదారుల్ని అనుమతించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు కాకుండా మిగతా వారి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 

 

పరిశ్రమల నిర్వాహకులు లాక్‌డౌన్‌ సమయానికి అనుకూలంగా కార్మికుల రాకపోకల్ని అనుమతించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు .డీజీపీ స్వయంగా రంగంలోకి దిగడంతో..పొలిస్లు  వాహనదారులపై కొరఢా ఝులిపించారు. సరైన ఆధారాలు, ద్రువపత్రాలు లేకుండా బయటకు వచ్చిన వారిపై లాఠీ ఝులిపించారు. వేల సంఖ్యలో లాక్‌డౌన్‌ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నిబంధనలు పాటించని వారిపై 5680 కేసులు నమోదు చేశారు. రాచకొండ పరిధిలో 2500 పై చిలుకు ఉల్లంఘన కేసులు నమోదు చేసి, 1958 వాహనాలు సీజ్‌ చేశారు. సైబరాబాద్‌ పరిధిలో 2000 కేసులు నమోదు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చెందిన 92 కార్లు, 36 ఆటోలు, 592 బైకులను మొత్తం 720 వాహనాలు సీజ్‌ చేశారు. à°ˆ క్రమంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. రోజుమాదిరిగానే అత్యవసర సర్వీసు à°•à°¿à°‚à°¦ రోడ్డుపైకి వచ్చిన వాహనదారులపై లాఠిన్యం ప్రదర్శించారు. స్విగ్గీ, జొమాటో, ఇతర à°ˆ కామర్స్‌ డెలివరీ బోయ్స్‌పై కర్రలతో దాడిచేశారు. వాహనాలు లాక్కున్నారు.  

లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన నుంచే ఆదేశాలు జారీ చేయడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పోలీసులు మరింత à°•à° à°¿à°¨ చర్యలు తీసుకున్నారు. హన్మకొండలో సీపీ తరుణ్‌జోషి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. శనివారం వరకు జిల్లాలో 21 వేల కేసులను నమోదు చేశారు. 300 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జరిమానా రూపంలో రూ.83 లక్షలు వసూలు చేశారు. లాక్‌డౌన్‌లో తెరిచి ఉంచిన దుకాణాదారులకు ఇప్పటి వరకు రూ. 50 లక్షల జరిమానాలు విధించారు.  మహారాష్ట్ర సరిహద్దుల్లో కరోనా బారిన పడిన మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పసిగట్టిన పోలీసులు ఆస్పత్రుల వద్ద నిఘా పెంచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరుకు రవాణా వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

గతంలో మాదిరిగా రాత్రి వేళల్లో మాత్రమే నగర రోడ్లపైకి à°† వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. రాత్రి 9 నుంచి ఉదయం 8 à°—à°‚à°Ÿà°² వరకే అనుమతి ఉంటుందన్నారు. కాగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వారికి పోలీస్లు à°ˆ-పాస్‌ జారీ చేస్తున్నారు. అయితే శనివారం నుంచి పోర్టల్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉన్న పర్మిటెడ్‌ యాక్టివిటీస్‌ ఆప్షన్‌ను తొలగించారు. కార్మికులు, చిరుద్యోగులు పర్మిటెడ్‌ యాక్టివిటీస్‌ ఆప్షన్‌లో à°ˆ-పా్‌సలకోసం దరఖాస్తు చేసుకుంటుండగా ఇప్పుడు à°† అవకాశం లేకుండా పోయింది.  కాగా లాక్‌డౌన్‌ సమయంలో ఆహార వస్తువులను సరఫరా చేస్తుండ à°—à°¾ జప్తు చేసిన వాహనాలతో పాటు అదుపులోకి తీసుకున్న యువకులను వెంటనే విడుదల చేయాలని మజ్లిస్‌ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు.