మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ రెండు డోసుల ప్యాక్‌ రూ.1,19,500

Published: Tuesday May 25, 2021

కరోనాపై పోరులో కీలకంగా భావిస్తున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ కాక్‌టెయిల్‌ మందు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లు విడుదల చేశారు. ఇవి దేశంలోని ప్రముఖ ఆస్పత్రుల్లో, కొవిడ్‌ చికిత్సా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. 1200 ఎంజీ మందు (కాసిరివిమాబ్‌ 600 ఎంజీ, ఇండెవిమాబ్‌ 600 ఎంజీ.. రెండూ కలిపి 1.2 గ్రాములు) ఉండే ఒక్కో డోసు ధర 59,750 రూపాయలు. ఒక్కో ప్యాక్‌లో రెండు డోసులుంటాయి. దాని గరిష్ఠ చిల్లర ధర.. అన్ని పన్నులతో కలిపి రూ.1,19,500. దాంతో ఇద్దరికి చికిత్స చేయొచ్చు. రెండో బ్యాచ్‌ జూన్‌ రెండోవారం ముగిసే సమయానికి అందుబాటులోకి రానున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు పాజిటివ్‌ వచ్చినపుడు à°ˆ ఔషధమే వాడారు.

 

ప్రయోగాత్మకంగా ఇవ్వగా  ఆయన రెండు రోజుల్లోనే కోలుకుని మళ్లీ ప్రచారానికి వెళ్లగలిగారు. అప్పట్నుంచీ à°ˆ ఔషధంపై ప్రపంచానికి ఆసక్తి పెరిగింది. కరోనా బారిన పడినవారిలో హైరిస్క్‌ గ్రూప్‌ వారికి పరిస్థితి ఆక్సిజన్‌ పెట్టే దాకా రాకముందే à°ˆ ఔషధాన్నిస్తే వారు ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం, మరణించే ముప్పు 70ు తగ్గిపోతాయని ట్రయల్స్‌లో తేలింది.  12 ఏళ్లు దాటినవారికి, కనీసం 40 కిలోల బరువున్నవారికి à°ˆ మందు వాడొచ్చు. ఆక్సిజన్‌ అవసరమైనవారికి మాత్రం à°† దశలో à°ˆ మందు వాడకూడదని ఎఫ్‌డీయే స్పష్టం చేసింది.  అమెరికాకు చెందిన రీజెనరాన్‌ కంపెనీ అభివృద్ధి చేసిన à°ˆ మందును విదేశాల్లో తయారుచేయడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన రోచె సంస్థ అనుమతి పొందింది. à°† సంస్థ భారత్‌లో సిప్లా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

కాసిరివిమాబ్‌, ఇమ్‌డెవిమాబ్‌ అనే రెండు రకాల మోనోక్లోనల్‌ యాంటీబాడీల మిశ్రమం à°ˆ మందు. వైర్‌సలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటితో సమర్థంగా పోరాడే యాంటీబాడీలను తయారుచేస్తుంది. అలాంటి యాంటీబాడీలను ప్రయోగశాలలో తయారుచేస్తే à°† ప్రొటీన్లను మోనోక్లోనల్‌ యాంటీబాడీలుగా వ్యవహరిస్తారు. వైర్‌సలో కొత్త మ్యుటేషన్ల ముప్పును ఎదుర్కొనేందుకే రెండూ కలిపి ఇవ్వాలని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే.. కొత్త వేరియంట్లు స్పైక్‌ డిలీషన్స్‌ చేసుకుంటున్నాయని.. మోనోక్లోనల్‌ యాంటీబాడీలు పనిచేసేదే స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని కాబట్టి, కొత్త వేరియంట్లపై à°ˆ మందు అంతగా ప్రభావం చూపకపోవచ్చని గ్లోబల్‌ హెల్త్‌ చారిటీ ‘వెల్‌కమ్‌ ట్రస్ట్‌’కు చెందిన నిక్‌ కామక్‌ అన్నారు.