ప్రమాదాల పరంపర!

Published: Wednesday May 26, 2021

 à°µà°¿à°¶à°¾à°–పట్నంలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో à°’à°• పరిశ్రమలో ప్రతి నెలా à°’à°• ప్రమాదం జరుగుతూనే ఉంది. పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్‌, హెచ్‌పీసీఎల్‌, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. à°—à°¤ ఏడాది ఇదే మే నెలలో గోపాలపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయారు. à°† తరువాత హిందూస్థాన్‌ షిప్‌యార్డులో క్రేన్‌ పనితీరు పరిశీలిస్తుండగా విరిగిపడి ఎనిమిది మంది మరణించారు. కరోనా సమంలో పరిశ్రమలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎంతవరకు పాటిస్తున్నదీ అధికారులు ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. భారీ పరిశ్రమల్లో అన్నీ యథాతథంగా నడుస్తున్నాయి.

 

రెండు వారాల క్రితం దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో విదేశాల నుంచి తుక్కు తెచ్చే ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి పరవాడ మండలం భరణికం గ్రామంలో అనన్య ఫార్మా కంపెనీలో లిక్విడ్‌ అమోనియం గ్యాస్‌ లీకై à°† ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలు వచ్చాయి. à°ˆ విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌ కంపెనీని తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేయించి, విచారణకు ఆదేశించారు. ఇప్పుడు హెచ్‌పీసీఎల్‌లో క్రూడాయల్‌ శుద్ధి చేసే యూనిట్‌-3లో మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదమేనని అంతా భావించారు. అయితే అధికారులు తక్షణమే స్పందించడం, à°† యూనిట్‌కు క్రూడాయిల్‌ సరఫరా నిలిపివేయడం, ఆరుకు పైగా అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్మడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

 

పైపులైన్‌ లీకేజీ...రెండు చోట్ల మంటలు

మూడో యూనిట్‌కు క్రూడాయల్‌ను సరఫరా చేసే ఓవర్‌హెడ్‌ పైపులైనులో లీకేజీ వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. à°ˆ లీకేజీల వల్ల రెండుచోట్ల మంటలు చెలరేగాయి. ప్రధానంగా చమురుతో వ్యవహారం నడిపే సంస్థలో ప్రధాన పైపులైన్‌కే లీకేజీ ఏర్పడింది అంటే...నిర్లక్ష్యం వహించారని చెప్పక తప్పదు. దానిని తరచూ తనిఖీ చేయాల్సిన యంత్రాంగం ఏమైంది?, రోజువారీ తనిఖీల్లో భాగంగా పరీక్షించారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. హెచ్‌పీసీఎల్‌, స్టీల్‌ప్లాంటు, షిప్‌యార్డు, ఫార్మా సిటీ వంటి భారీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే విచారణకు ఆదేశించినా, à°† తరువాత నివేదిక బయటకు రాకుండా, ఎటువంటి చర్యలు లేకుండా కాలం గడిపేస్తున్నారు. à°—à°¤ ఏడాది షిప్‌యార్డులో జరిగిన క్రేన్‌ ప్రమాదానికి యాజమాన్యం పొరపాటే కారణమని తేలినా ఇప్పటివరకు ఏ ఒక్కరిపైనా చర్యలు చేపట్టలేదు.

 

ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి సంబంధించి హైపవర్‌ కమిటీ సిఫారసులను అమలు చేయలేదు. అలాగే స్టీల్‌ప్లాంటులో ఏమి జరిగినా బయటకు పొక్కనివ్వరు. అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రమాదం జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేసి à°† తరువాత దానిని పక్కన పెట్టేస్తున్నారు. దాదాపుగా రూ.20 వేల కోట్ల వ్యయంతో కొన్నేళ్లుగా విస్తరణ పనులు చేపడుతున్న హెచ్‌పీసీఎల్‌లో రోజూ వేయి మందికి తక్కువ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రమాదం జరిగిన యూనిట్‌లో కూడా 100 మంది వరకు విధుల్లో ఉన్నారు. సైరన్‌ మోగడం వల్ల వారం