రఘురామ దెబ్బలకు ‘మసిపూసిన’ డాక్టర్లు

Published: Thursday May 27, 2021

‘డాక్టర్‌ దగ్గర అబద్ధం చెప్పవద్దు’.. అంటారు! కానీ... డాక్టర్లే అబద్ధాలు చెబితే! అందులోనూ.. తాము గుర్తించి, లిఖితపూర్వకంగా రాసిన వివరాలకు విరుద్ధంగా నివేదిక ఇస్తే!? ఇక.. అడ్డంగా బుక్‌ అయిపోవడం ఖాయం! ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీఐడీ కస్టడీలో ఉండగా తగిలిన గాయాలపై నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌) మెడికల్‌ బోర్డు ‘పెద్ద’ తప్పులే చేసినట్లు తెలిసింది. ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు కాళ్లకు దెబ్బలు తగిలినట్లు స్పష్టంగా గుర్తించారు. ఎంపీని గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన వెంటనే.. ఔట్‌ పేషంట్‌ (ఓపీ) చీటీ రాసిన తర్వాత కొంత మంది వైద్యులు ఆయనను పరీక్షించారు. à°† సమయంలో రఘురామ తనను కొంతమంది లాఠీలతో కొట్టినట్లు సమాచారం ఇచ్చారు. ‘‘ముఖానికి మాస్కులు పెట్టుకున్న సుమారు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు నన్ను కొట్టారు. 14à°µ తేదీ రాత్రి 11.30 గంటలకు ఇది జరిగింది’’ అని వైద్యులకు తెలియజేశారు. 15à°µ తేదీ అర్ధరాత్రి తర్వాత వైద్యులు ఆయన కాళ్లను పరీక్షించారు. à°† సమయంలో ఎంపీ కుడి కాలు, కాళ్ల వేళ్ల à°•à°¿à°‚à°¦ చర్మం కమిలిపోవడంతోపాటు కాళ్లలో వాపు, కొంత రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు.

 

à°ˆ వివరాలను ఓపీ చీటీలో స్పష్టంగా నమోదు చేశారు. ఇందులో ‘కంట్యూషన్‌’ అనే పదాన్ని ఉపయోగించారు. కంట్యూషన్‌ అంటే దెబ్బతగలడం వల్ల చర్మం కమిలిపోయిందని అర్థం. అలాగే.. ‘‘ఎంపీ కుడి కాలు, కాలి వేళ్ల à°•à°¿à°‚à°¦ భాగం బాగా దెబ్బతింది. చర్మం à°•à°¿à°‚à°¦ రక్తస్రావం కనిపించింది’’ అని కూడా నిర్ధారించారు. ఇక.. ఎంపీని ఇన్‌పేషంట్‌à°—à°¾ అడ్మిట్‌ చేసుకున్న అనంతరం రాసిన కేస్‌ షీట్‌లో కూడా ఇవే వివరాలు ఉన్నాయి. ఇందులో.. కంట్యూషన్‌ (ట్రామాటిక్‌) అనే పదాన్ని ఉపయోగించారు. ట్రామాటిక్‌... అంటే దెబ్బ వల్ల ఆయన కాళ్లు వాచినట్లు, రంగు మారినట్లు, రక్తస్రావం అయినట్లు గుర్తించారు.

 

ఎంపీ రఘురామరాజు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ పూర్తయ్యే వరకూ ఆయన కాళ్లకు దెబ్బలు తగలడం వల్లనే వాపు, రంగు మార్పు, రక్తస్రావం జరిగినట్లు వైద్యులు ‘అక్షరాలా’ చెబుతూ వచ్చారు. కానీ.. కోర్టుకు అందించిన నివేదికలో ఇవేమీ లేవు. ఓపీ చీటీలో, కేస్‌షీట్‌లో పేర్కొన్న వివరాలకు భిన్నంగా నివేదికను రూపొందించారు. ‘‘ప్రస్తుతం పేషంట్‌ (ఎంపీ) పరిస్థితి సాధారణంగా ఉంది. ఆయనకు పైకి కనిపించే దెబ్బలు లేవు. క్లినికల్‌ ఎగ్జామినేషన్‌లో మేం గుర్తించినవేవీ.. ఆయన ఆరోపించినట్లుగా ఎవరో కొడితే ఏర్పడినవి కావు’’ అని సింపుల్‌à°—à°¾ తేల్చేశారు. ఎంపీ కాళ్లు వాచాయి, రంగు మారాయి.. అని నివేదికలో చెప్పినా.. కేస్‌ షీటు, ఓపీ చీటీలో తాము రాసిన అంశాలేవీ హైకోర్టు ఇచ్చిన నివేదికలో పొందుపరచకపోవడం à°’à°• ఎత్తు! ఆయనను ఎవరూ కొట్టకపోతే, కాళ్లు ఎందుకు వాచాయి? రంగు ఎందుకు మారింది? అని చెప్పకుండానే à°’à°• అసమగ్ర నివేదికను రూపొందించడం మరొక ఎత్తు!

 

రఘురామకు తగిలిన గాయాలపై జీజీహెచ్‌ బోర్డు ఇచ్చిన నివేదిక అసమగ్రంగా, తూతూ మంత్రంగా ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బీపీ బాగుంది, ఆక్సిజన్‌ లెవెల్స్‌ బాగున్నాయి, గుండె బాగుంది, మూత్రపిండాలు బాగున్నాయి, పేషంట్‌ స్టేబుల్‌à°—à°¾ ఉన్నాడు... అంటూ బారెడు రాసి, అసలైన కాళ్ల వాపులు, కందిన చర్మం గురించి మాత్రం రెండే రెండు లైన్లు నామమాత్రంగా రాసేశారు. చివర్లో.. అవి కూడా ఆయన ఆరోపిస్తున్నట్లుగా ఎవరో కొట్టినవి కావని చెప్పారు. అవి కొట్టిన గాయాలు కాకపోతే, ఎలా అయ్యాయో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందనే విషయం ‘గుర్తుంచుకునే’ మరిచిపోయారని చెప్పవచ్చు.