25% సమయం పార్టీకిస్తే అధికారం పోయేది కాదు!

Published: Saturday May 29, 2021

 ‘అధికారంలో ఉన్న సమయంలో పాతిక శాతం సమయం పార్టీకి ఇచ్చి ఉంటే అధికారం పోయేది కాదు. హైదరాబాద్‌లో మాదిరిగా విభజిత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అభివృద్ధి చూపించాలని పరుగులు తీశాను. అందరం రాత్రింబవళ్లూ పనిచేశాం. కానీ దురదృష్టం.. ప్రజలు దానిని అర్థం చేసుకోలేదు’ అని మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. శుక్రవారం మహానాడులో టీడీపీ సంస్థాగత అంశాలపై ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యం నెరవేరాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందని, పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటేనే విజయాన్ని అందుకోగలుగుతామని తెలిపారు. టీడీపీని లేకుండా చేయాలని చరిత్రలో చాలా ప్రయత్నాలు జరిగాయని.. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారని, కానీ పార్టీ అన్నిటినీ తట్టుకుని నిలబడిందని చెప్పారు. ‘కరోనా విలయం వల్ల ప్రజల్లోకి వెళ్లి పనిచేయడం కొంత కష్టంగా ఉంది. టెక్నాలజీని వినియోగించుకుని ఆన్‌లైన్‌ సమావేశాల ద్వారా పరస్పర సంబంధాలను పెంచుకుంటున్నాం. à°ˆ ఏడాదంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది జరగాలి. ఆంధ్రలో జిల్లా కమిటీల స్థానంలో పార్లమెంటు స్థానాల వారీగా కమిటీలు వేశాం. ఇంకా కొన్ని కమిటీలు వేయాలి. 15 రోజుల్లో à°ˆ ప్రక్రియ పూర్తి కావాలి. పార్టీ అనుబంధ సంఘాలకు కూడా నెల రోజుల్లో పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు జరగాలి. లోకేశ్‌ à°ˆ బాధ్యత తీసుకుని నెల రోజుల్లో పూర్తి చేసి చూపించాలి. వేశామంటే వేశామని కాకుండా పనిచేసేవారికి అవకాశాలు ఇవ్వాలి. మొహమాటాలు వద్దు. నేను కూడా ఇకపై నిక్కచ్చిగా ఉంటాను. ఎవరైనా అప్పగించిన పని చేయలేకపోతే à°’à°•à°Ÿà°¿à°•à°¿ రెండు సార్లు చెబుతాను. అప్పటికీ ఫలితం లేకపోతే అదే విషయం చెప్పి మార్పు చేసుకుంటాం. మార్పుచేసినా ఎవరికిచ్చే గౌరవం వారికిస్తాం. కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జులు బలహీనంగా ఉన్నారు. 

 

ఎన్నికలు వచ్చినప్పుడే పనిచేస్తామంటే కుదరదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. కసితో పనిచేసే వారిని గుర్తించి ముందుకు తేవాలి. పోరాడేవారిని ప్రోత్సహించాలి. వారిపై మహా అయితే ఒకటో రెండో కేసులు పెడతారు. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మన నాయకులు కొందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఏమైంది? వాళ్లేమైనా రాజకీయాలు మానేసి ఇళ్లలో కూర్చున్నారా? మనపై పెట్టే తప్పుడు కేసులపై మనం కూడా ఎదురు ప్రైవేటు కేసులు పెడదాం. దీనికి మంచి న్యాయవాదుల టీం తయారు చేస్తున్నాం’ అని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు à°’à°• కార్యకర్తను తయారు చేయాలని ఆలోచిస్తున్నామని, దీనివల్ల ప్రజలతో సంబంధాలు పెరుగుతాయని తెలిపారు. ‘కొత్త రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించాలి. మనం ఇప్పుడు వేసే పునాది మరో 40 ఏళ్లపాటు పార్టీని నడిపించాలి. గెలుపు గుర్రాలను తయారు చేసుకోవాలి. ఎవరు ప్రజల్లో పనిచేస్తారో వారే మనకు కావాలి. పార్టీ నేతలు తమ మధ్య తగాదాలు తగ్గించుకోవాలి. చిన్న చిన్న విభేదాలకు ఆస్కారం ఇవ్వొద్దు. సమష్టిగా పోరాడితేనే గెలుస్తామని గుర్తించండి’ అని కోరారు. 

 

గట్టిగా మాట్లాడితే మళ్లీ అరెస్టు చేస్తారని తనకు కొంత మంది సందేశాలు పంపుతున్నారని, మళ్లీ అరెస్టుకైనా.. పంచె, చొక్కాతో తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘à°’à°• దుర్మార్గుడు, దుష్టుడు అధికారంలో ఉన్నాడు. à°ˆ సమయంలో తెగించి పోరాడే నాయకత్వం మనకు కావాలి. అరెస్టయినా ఫర్వాలేదనుకునేవారు ముందుకు రావాలి. ఇది మొహమాటాల సమయం కాదు. పనిచేయని వారిని అధినేత పక్కన పెట్టాలి. నా నుంచి ఆశించిన ఫలితం లేకపోతే నన్ను కూడా పక్కన పెట్టండి. అలాగైతేనే పార్టీ బాగుపడుతుంది. భయపడే వారితో పార్టీకి ఉపయోగం లేదు. ధైర్యంగా నిలబడి పనిచేసేవారినే కమిటీల్లోకి తీసుకోవాలనుకుంటున్నాం. పార్టీని నమ్ముకుని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. అనేక మంది à°ˆ ప్రభుత్వంలో అనేక రకాలుగా నష్టపోయారు. వారి కోసమైనా మనం  పోరాడాలి’ అని అన్నారు.