టీటీడీ పుస్తకం మొత్తం తప్పుల తడక

Published: Saturday May 29, 2021

హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అంటూ శ్రీరామనవమి రోజు టీటీడీ విడుదల చేసిన పుస్తకం మొత్తం అసంపూర్ణ జ్ఞానంతో తయారుచేసిన తప్పుల తడక అని కర్ణాటకలోని కిష్కింధ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన టీటీడీ విడుదల చేసిన పుస్తకంలోని 14 పేజీల్లో ఏయే అంశాల్లో ఎలాంటి తీవ్రమైన తప్పులున్నాయో మీడియాకు వివరించారు. పండితులపై ఒత్తిడి తెచ్చి కీర్తి కోసం తిరుమలను హనుమ జన్మస్థలంగా టీటీడీ ప్రకటించిందని గోవిందానంద సరస్వతి ఆరోపించారు. శంకర, రామానుజ, మధ్వ పీఠాధిపతుల సమక్షంలో దీనిపై శాస్త్ర చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. తిరుమల పెద్ద జీయర్‌కు కూడా గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీటీడీ తప్పును అంగీకరించి, సరిదిద్దుకోవాలన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగి తుది నిర్ణయం తీసుకొనే వరకు హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంటే తమకు అంగీకారం కాదన్నారు. à°ˆ వ్యవహారంలో ఇప్పటికే టీటీడీకి కోర్టు నోటీసులు వెళ్లినట్టు తెలిసిందని గోవిందానంద వ్యాఖ్యానించారు.