కరోనా రోగికి బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగస్‌!

Published: Sunday May 30, 2021

ఇప్పటికే బ్లాక్‌, వైట్‌, ఎల్లో ఫంగ్‌సలు దడపుట్టిస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ‘క్రీమ్‌ ఫంగస్‌’ కూడా వచ్చిపడింది. ఇందుకు సంబంధించిన à°“ కేసును గుర్తించామని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వైద్య కళాశాల ఈఎన్‌à°Ÿà±€ విభాగం వైద్యాధికారులు వెల్లడించారు. కరోనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న à°“ రోగికి బ్లాక్‌, క్రీ మ్‌ ఫంగ్‌సలు రెండూ సోకినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు.

 

కరోనా రోగులకు మితిమీరిన స్థాయిలో అందిస్తున్న యాంటీ బయోటిక్‌ ఔషధాలతో జీర్ణాశయంలోని కీలకమైన గట్‌ బ్యాక్టీరియా నశిస్తోందని, బహుశా అందువల్లే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. à°ˆ ఇన్ఫెక్షన్లను మొగ్గలోనే తుంచేయడంలో గట్‌ బ్యాక్టీరియా ముఖ్య పాత్ర పోషిస్తుందని అంటున్నారు.