రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి

Published: Monday May 31, 2021

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందారు. గతంలో ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు హల్‌చల్ చేశాయి. అయితే ఆనందయ్య వైద్యాన్ని తప్పుగా నిరూపించడం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ఆయన జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదుటపడ్డారు. అనంతరం ఆయన ఆరోగ్యం తిరిగి విషమించడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య నేడు తుదిశ్వాస విడిచారు.

 

అప్పట్లో దాదాపు మరణం అంచులకు వెళ్లి ఆనందయ్య మందుతో తిరిగి వచ్చానని కోటయ్య చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ‘‘ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న.. ఇంకా రెండు నిముషాలు ఆగితే, ఆక్సిజన్ లేకపోతే చనిపోతా.. దీంతో వెంటనే మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నానని, à°ˆ మందు చాలా అద్భుతం’’ అని గతంలో కోటయ్య తెలిపారు