మేనిఫెస్టోలో దశలవారీ ‘నిషేధం’ రెండేళ్ల నివేదికలో ‘నియంత్రణ’

Published: Wednesday June 02, 2021

సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తామని చెప్పుకొచ్చిన జగన్‌ ప్రభుత్వం, అకస్మాత్తుగా నిషేధం అనే పదాన్ని కాస్తా నియంత్రణగా మార్చేసింది. తాజాగా విడుదల చేసిన రెండేళ్ల పాలనపై నివేదికలో మద్యానికి సంబంధించి.. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశామని, 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశామని, మొత్తం షాపుల్లో 33ు తగ్గించామని పేర్కొంది. విక్రయ వేళలు తగ్గించామని, ధరల పెంపుతో అమ్మకాలు భారీగా తగ్గించామని వివరించింది. కానీ à°ˆ చర్యలేవీ దశలవారీ మద్యం నిషేధానికి ఏమాత్రం దోహదపడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు ఉన్నాయి. ఒక్కో షాపునకు సగటున 10 బెల్టులు ఉన్నాయని పేర్కొంటూ.. మొత్తం 43 వేల బెల్టులు రద్దుచేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవానికి టీడీపీ ప్రభుత్వంలోనే బెల్టులపై ఉక్కుపాదం మోపి.. వాటిని తొలగించారు. à°† తర్వాత వ్యవస్థీకృతంగా నడిచే షాపులు కనుమరుగై వాటి స్థానంలో మొబైల్‌ బెల్టులు వెలిశాయి. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ బెల్టుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. అలాంటప్పుడు 43వేల బెల్టులు ఎక్కడ రద్దు చేశారనేది వైసీపీ ప్రభుత్వానికే తెలియాలి. తొలగించినట్లుగా చెబుతున్న 43 వేల షాపులపై ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమందిని అరెస్టు చేశారు? వారికి ఎలాంటి శిక్షలు పడ్డాయి? అనే వివరాలు ఇప్పటికీ ఎక్కడా కనిపించవు. మద్యం షాపు పక్కనే మద్యం తాగేందుకు వీలుగా ఉన్న పర్మిట్‌రూమ్‌లను వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసింది. కానీ, కేవలం రూమ్‌ తరహాలో లేకపోయినా అనేక చోట్ల స్వేచ్ఛగా దుకాణం వద్దే మద్యం తాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

మద్యం అమ్మకాలు తగ్గించడానికే ధరలు పెంచినట్లు చెబుతున్న వైసీపీ ప్రభుత్వం దీనిపై పలుమార్లు నిర్ణయాలు మార్చుకుంది. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో 43 రోజుల పాటు మూసేసిన  షాపులను తిరిగి తెరిచిన ప్రభుత్వం రద్దీని నియంత్రించలేకపోవడంతో వచ్చిన విమర్శల వల్ల ఒకేసారి వంద శాతం ధరలు పెంచేసింది. అసలు కారణం రద్దీ నియంత్రణ అయితే, అమ్మకాలు తగ్గించాలనే ఉద్దేశంతోనే పెంచినట్లు అనంతరం ప్రచారం మొదలుపెట్టింది. పోనీ పెంచిన ధరలను అలాగే ఉంచినట్లయితే ప్రభుత్వ వాదనకు కొంత బలం చేకూరేది. కానీ, మద్యం అమ్మకాలు తగ్గిపోవడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. రెండు నెలల వ్యవధిలోనే దశలవారీగా అన్ని కేటగిరీల మద్యం ధరలను తగ్గిస్తూ వచ్చింది. నిజంగా నిషేధమే లక్ష్యం అయితే ఒకసారి పెంచిన ధరలు తగ్గించాల్సిన అవసరం ఏంటనేది అర్థంకాని విషయం. 

మరోవైపు ప్రభుత్వం ఇటీవల మద్యం అమ్మకం సమయాల్లోనూ సడలింపులు తీసుకొచ్చింది. రాత్రి 8à°—à°‚à°Ÿà°² వరకే షాపులు తెరిచి ఉండాల్సి ఉండగా, 9 à°—à°‚à°Ÿà°² వరకు అమ్మాలనే అనధికార ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో వ్యక్తికి 3 సీసాలకు మించి అమ్మకూడదనే నిబంధనలు పెట్టి, ఐదారు సీసాలు అమ్మినా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. 

మద్యం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఏటా పెరుగుతోంది. 2019-20లో ఎక్సైజ్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.17,500 కోట్ల ఆదాయం వస్తే, 2020-21లో రూ.17,600 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే, à°ˆ ఏడాదిలోనే మద్యం షాపులు, బార్లు 43 రోజులు పూర్తిగా మూతపడ్డాయి. అయినా గతంలో కంటే ఎక్కువ ఆదాయం రావడం గమనార్హం. కానీ రెండేళ్ల నివేదికలో ప్రభుత్వం à°ˆ ఆదాయం లెక్కలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఎంతసేపూ ప్రభుత్వానికి మైలేజీని తెచ్చిపెట్టే అంశాలు తప్ప, రెండో కోణాన్ని చూపే ప్రయత్నం చేయలేదు. à°ˆ పరిణామాల నేపథ్యంలో అసలు మద్య నిషేధం ఉంటుందా? లేక నియంత్రణకే పరిమితం అవుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తన నివేదికలో కొత్తగా చేర్చిన ‘నియంత్రణ’ అనే పదం à°ˆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.