కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ వేగం

Published: Wednesday June 02, 2021

కరోనా బాధితుల సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ వేగంగా ముందుకు సాగుతోంది. హెరిటేజ్‌ సీఎ్‌సఆర్‌ ఫండ్స్‌తో ఇప్పటికే ఏపీలో 4 ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌.. తెలంగాణాలో మరో 2 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ట్రస్ట్‌ à°Žà°‚à°¡à±€ నారా భువనేశ్వరి మంగళవారం à°’à°• ప్రకటనలో తెలిపారు. ట్రస్ట్‌ తరుపున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న దాతలకు భువనేశ్వరి అభినందనలు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 25 లక్షల మేర విరాళాలు అందాయని, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవల కోసం న్యూజిలాండ్‌ టీడీపీ అభిమానులు రూ.5 లక్షలు, గుత్తికొండ వీరభద్రరావు (కృష్ణా జిల్లా) రూ.1,11,116 విరాళంగా అందించారని ఆమె తెలిపారు. కాగా కరోనాతో మృతి చెందిన వారి ఆఖరి మజిలీ గౌరవప్రదంగా ఉండాలన్న ఉద్దేశంతో కుటుంబసభ్యులు ముందుకు రాని మృతదేహాలు, అనాథ శవాలకు వారి సాంప్రదాయాలకు అనుగుణంగా ట్రస్ట్‌ అంత్యక్రియలు నిర్వహిస్తోందని చెప్పారు. కాగా.. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో టెలిమెడిసిన్‌ సేవలు, ఉచిత మందులు, ఆహార పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ పేర్కొంది.