కరోనా వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్‌ అడ్డుకోలేదు

Published: Thursday June 03, 2021

వ్యాక్సిన్‌ వేసుకుంటే ఇక కరోనాను జయించినట్టేనని చాలా మంది భావిస్తున్నారు. కానీ.. కరోనా వ్యాక్సిన్‌ వైర్‌సను చంపేసే బ్రహ్మాస్త్రం కాదు. నిమిషాల్లో వైర్‌సను అంతం చేసి, ప్రాణాలను కాపాడే సంజీవని అంతకంటే కాదు. కేవలం కరోనా వైర్‌సను తట్టుకునే శక్తి సామర్థ్యాలను శరీరానికి అందిస్తుంది. వైరస్‌ సోకితే ఇన్ఫెక్షన్‌ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది.

 

ఆస్పత్రి పాలయ్యే అగత్యాన్ని.. ప్రాణాపాయ ముప్పును తగ్గిస్తుంది. à°ˆ విషయం తెలియక చాలా మంది టీకాలు వేయించుకున్నాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. à°† నిర్లక్ష్యమే అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. ఇటీవలికాలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టీకాలు తీసుకున్నవారంతా.. తమకేం కాదులే అన్న ధోరణితో వ్యవహరించడమే సమస్యకు, వైరస్‌ వ్యాప్తి పెరగడానికి కారణమవుతోంది. à°† ధోరణితో వారు వైరస్‌ బారిన పడడమే కాక.. కుటుంబసభ్యులకు, చుట్టూ ఉండేవారికి వ్యాపించడానికి కారణమవుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఇలా వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా బారిన పడినవారిలో చాలా మంది స్వల్పలక్షణాలతోనే బయటపడ్డారు. మిగిలిన తక్కువ మందిలో కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్సతో ఇంటికి చేరుకున్నారు. మరికొందరు ఆక్సిజన్‌ సపోర్టు దాకా వెళ్లగా.. ఇంకొందరికి వెంటిలేటర్‌ చికిత్స అవసరమైంది. దురదృష్టవశాత్తూ అతికొద్దిమంది మాత్రం ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్‌ ఒక్కొక్కరి శరీర తీరును బట్టి ఒక్కొక్కలా పనిచేయడమే à°ˆ మరణాలకు కారణం.

 

వయస్సు, కోమార్బిడిటీస్‌, సోకిన వేరియంట్‌, టీకా వేయించుకున్నాక ఎన్నాళ్లకు వైరస్‌ సోకింది.. ఇలా చాలా అంశాలు వ్యాక్సిన్‌ పనితీరుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా.. 65 ఏళ్లు దాటినవారిలో టీకా రక్షణ దాదాపు 50శాతమే ఉంటోందని, యువతలో à°† రక్షణ 89ు దాకా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మే 10à°¨ తెలిపినట్టు వైద్యులు గుర్తుచేస్తున్నారు. అలాగే కొత్త వేరియంట్లు కూడా రీఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని వారు తెలిపారు. ఉదాహరణకు.. సెకండ్‌వేవ్‌లో ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపిన బి.1.617.2 వేరియంట్‌ చాలా తీవ్రమైందని.. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 15 తర్వాత ఏపీలో జీన్‌ సీక్వెన్సింగ్‌ చేసిన ప్రతి రెండో నమూనా à°ˆ వేరియంట్‌దిగానే తేలిందని.. ఇప్పుడు దక్షిణ తెలంగాణలో కూడా à°† వేరియంట్‌ ప్రభావం ఎక్కువగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. à°ˆ వేరియంట్‌కు.. టీకా వల్ల కలిగే రక్షణను తప్పించుకోగల సామర్థ్యం ఉందని గుర్తుచేస్తున్నారు. పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ చేసిన à°’à°• అధ్యయనం ప్రకారం.. డెల్టా వేరియంట్‌పై సింగిల్‌ డోసు టీకా ప్రభావశీలత కేవలం 33% మాత్రమేనని తేలింది.

 

ఉన్న à°ˆ వేరియంట్లు చాలవన్నట్టు.. దేశవ్యాప్తంగా నిత్యం లక్షల మందికి సోకుతుండడం వల్ల వైర్‌సలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్నా కూడా.. అలాంటి కొత్త వేరియంట్లకు ఎక్స్‌పోజ్‌ అయితే ఇన్ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువ. అప్పుడూ టీకా వల్ల కొంత రక్షణ ఉంటుంది. కానీ.. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలం కన్నా, టీకా వల్ల వచ్చిన యాంటీబాడీల బలం కన్నా.. కొత్త వేరియంట్‌ బలం ఎక్కువైతే ఇన్ఫెక్షన్‌ తీవ్రమయ్యే ముప్పుంది.