అమూల్‌కు 4వేల కోట్లు.. రెండేళ్లలో రాష్ట్రమంతా విస్తరణ

Published: Saturday June 05, 2021

 à°…మూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టు కోసం రాష్ట్రప్రభుత్వం తరఫున రెండేళ్లలో రూ.4వేల కోట్ల ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ద్వారా పాల సేకరణను శుక్రవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార రంగంలోని డెయిరీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయని అన్నారు. ‘అవి ఎందుకు మూతపడ్డాయి.. ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను, వినియోగదారులను దోపిడీ చేయగలిగే స్థితిలో ఎందుకున్నాయని చూస్తే.. అమూల్‌ మాదిరిగా సహకార డెయిరీలకు పూర్తి స్థాయి ప్రొసెసింగ్‌ యూనిట్లు లేకపోవడం, మార్కెట్‌ను పెంచుకునే స్థాయికి ఎదగకపోవడమే కారణం. అన్నింటికీ మించి సహకార డెయిరీల్లో మంచివాటిని ఏకంగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేసి, వాటిని ప్రైవేటు ఆస్తుల కిందకు మార్చుకుంటున్నారు. ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో ప్రయోజనాలు ఉన్నందున వాళ్ల ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్రంలో సహకార వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు. à°† పరిస్థితులను మార్చాలనే తలంపుతోపాటు, పాడి పశువులు పెంచే అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్న ఆరాటంతో అమూల్‌ ప్రాజెక్టు ఆలోచన పుట్టుకొచ్చింది’ అని జగన్‌ వివరించారు. ‘అమూల్‌లో వాటాదారులు ప్రైవేటు వ్యక్తులు కాదని..

అందరూ పాలు పోసే వారే. à°† కంపెనీ మిగిలిన డెయిరీల కన్నా పాల సేకరణ ధర ఎక్కువ ఇస్తోంది. లాభాలన్నీ ఏడాదికోసారి పాలుపోసే వారికే తిరిగిస్తోంది. సహకార రంగంలో డెయిరీని బాగా నడిపితే, దాని భవిష్యత్‌ ఎలా ఉంటుందనడానికి అమూల్‌ à°’à°• నిదర్శనం. అందుకే ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలో 9,899 గ్రామాల్లో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ కలెక్షన్‌ యూనిట్లు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో పాలు పోసే అక్కచెల్లెమ్మల కళ్లెదుటే పాల నాణ్యత నిర్ధారిస్తారు. ప్రతి లీటరుకు మిగతా డెయిరీల కంటే రూ.5-15 అధిక ధర చెల్లించడంతో పాటు పాలుపోసే రైతుల ఖాతాలకు 10 రోజుల్లో బిల్లులు జమ చేస్తోంది. ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, à°•à°¡à°ª, గుంటూరు జిల్లాల్లోని 722గ్రామాల్లో అమూల్‌ పాలసేకరణ జరుగుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 153గ్రామాల్లో అమూల్‌ పాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో 2,600 గ్రామాల్లో బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు తీసుకొచ్చాం. వచ్చే రెండేళ్లలో దశల వారీగా అమూల్‌ రాష్ట్రమంతా విస్తరిస్తుంది’ అని జగన్‌ తెలిపారు.

దేశంలో పాల ఉత్పత్తిలో యూపీ ప్రథమస్థానంలో ఉండగా.. ఏపీ 4à°µ స్థానంలో, గుజరాత్‌ 5à°µ స్థానంలో ఉనన్నాయని అమూల్‌ à°Žà°‚à°¡à±€ ఆర్‌ఎస్‌ సోధీ చెప్పారు. ఏపీలో రోజుకు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి అవుతోందని, వీటి విలువ రూ.7వేల కోట్లని చెప్పారు. అమూల్‌ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, లాభాలు మాత్రమే ఆర్జించడం తమ లక్ష్యం కాదని, అమూల్‌ ప్రాజెక్టు ద్వారా గుజరాత్‌లో మాదిరిగా ఏపీలోనూ పాడి రైతులకు మేలు జరుగుతుందని, తమ నైపుణ్యాలను రైతులకు పంచుతామని చెప్పారు. నాణ్యమైన పాల ఉత్పత్తులను మార్కెట్‌లో మరింత చేరువ చేస్తామన్నారు. రానున్న రోజుల్లో పాడి రైతుల సహకార సంస్థ చేతుల్లోనే 50ు మార్కెట్‌ ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అప్పలరాజు, పశుసంవర్ధకశాఖ ఎస్‌సీఎస్‌ పూనం, పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ à°Žà°‚à°¡à±€ అహ్మద్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు