రాత్రి వేళల్లో మళ్లీ కర్ఫ్యూ కొనసాగింపు

Published: Sunday June 06, 2021

 à°•à°°à±‹à°¨à°¾ సెకండ్‌వేవ్‌ ఉధృతి తగ్గుముఖం పడుతుండడం, పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో..  హైదరాబాద్లో పగటివేళల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో కరోనా ఉధృతంగా ఉండటంతో.. తొలుత నెల రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. à°† తర్వాత  మే 12 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. à°ˆ సమయంలో కేవలం ఉదయం 6 నుంచి 10 à°—à°‚à°Ÿà°² వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది. à°† తరువాత కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతుండడంతో మే 31 నుంచి సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 వరకు పొడిగించింది. à°ˆ గడువు బుధవారంతో ముగియనుంది. అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదవుతోందని, ప్రస్తుతం పాజిటివ్‌ రేటు 2శాతమే ఉంటోందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖ అందించే నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నందున.. à°ˆ నెల 9 తర్వాత పగటివేళల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా  సడలింపులకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. à°ˆ నెల 9 వరకు కరోనా తీవ్రత చాలావరకు తగ్గుతుందని, తగు జాగ్రత్తలతో ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలన్నీ నిర్వహించుకోవచ్చని కేటీఆర్‌ శుక్రవారం టిమ్స్‌ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. దీనిని బట్టి లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం 2 à°—à°‚à°Ÿà°² వరకు సడలింపులు ఉన్నందున.. దీనిని సాయంత్రం వరకు పొడిగించి, ఏప్రిల్‌లో విధించినట్టుగానే కేవలం రాత్రిపూట కర్ఫ్యూను మాత్రమే కొనసాగించాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొన్ని అత్యవసర ప్రభుత్వ విభాగాలు మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. ఇతర శాఖలు 50 శాతం సిబ్బందితో షిఫ్టుల విధానంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. à°ˆ నెల 9 తర్వాత అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలున్నాయి. ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్‌లో మెట్రో సేవలను కూడా సేవలను కూడా సాయంత్రం వరకు అనుమతించనున్నట్లు తెలుస్తోంది. 

విద్యాసంస్థలను జూన్‌ 16 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి వేసవి సెలవులు మే 31 వరకు ఉండగా.. జూన్‌ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ను à°ˆ నెల 9వరకు పొడిగించినందున.. వేసవి సెలవులను 15 వరకు పొడిగించారు. తాజాగా à°ˆ నెల 16 నుంచి పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో సిబ్బందిని పూర్తిస్థాయిలో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఇక డిగ్రీ కాలేజీల్లో జూన్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి.

వాటిని కొనసాగిస్తూనే సిబ్బందిని కూడా అనుమతించే అవకాశాలున్నాయి. అయితే కరోనా మూడో వేవ్‌ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో.. విద్యాసంస్థల్లో కేవలం సిబ్బందినే అనుమతించాలని ప్రభుత్వం బావిస్తోంది. విద్యార్థులకు మాత్రం ప్రత్యక్ష తరగతులను అనుమతించకుండా.. ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగించనుంది.