ఎవరు పంపారు? ఎందుకు?

Published: Sunday June 06, 2021

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ రాజు మాట à°’à°• సంచలనం. ఆయన అరెస్టు తర్వాత జరిగిన ప్రతి పరిణామమూ సంచలనమే! ఇప్పుడు అదే కేసులో... ఎవరి ఊహకూ అందని à°’à°• కొత్త, వింత సంచలనం చోటు చేసుకుంది. అదే... ఫోన్‌ నంబర్‌ 9్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ్ఠ1. à°ˆ ఫ్యాన్సీ నంబర్‌ ఎంపీ రఘురామదే. అయితే... à°ˆ నంబర్‌ నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ శనివారం ట్వీట్‌ చేశారు. à°ˆ నంబర్‌ తమ కాంటాక్ట్‌ లిస్టులో లేదని, ఇది ఎంపీ రఘురామకు చెందినదిగా తెలుస్తోందని చెప్పారు. దీనిపై ఎంపీ స్పందించి స్పష్టత ఇస్తే బాగుంటుందని ట్విటర్‌లో తెలిపారు. వెంటనే దీనిపై రఘురామ ట్విటర్‌ వేదికగానే స్పందించారు. ‘‘సర్‌, నన్ను అరెస్టు చేసిన మే 14à°µ తేదీనే నా ఫోన్‌ను సీఐడీ పోలీసులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి à°† ఫోన్‌ వారి వద్దే ఉంది. నాలుగు రోజుల క్రితం à°† సిమ్‌ బ్లాక్‌ చేసి కొత్తది తీసుకున్నాను. ఫోన్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా సీఐడీకి శుక్రవారం లీగల్‌ నోటీసులు కూడా ఇచ్చాను. మే 14à°µ తేదీనుంచి జూన్‌ 1à°µ తేదీవరకు నేను ఎవరికీ మెసేజ్‌లు పంపించలేదు. ఒకవేళ నా ఫోన్‌ను అక్రమంగా ఉపయోగించి ఉంటే సునీల్‌ కుమార్‌, ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అని రఘురామ పేర్కొన్నారు.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమేశ్‌ ట్వీట్‌కు... రఘురామ సమాధానం! à°† విషయం వరకు అంతటితో స్పష్టత వచ్చేసింది. అయితే... సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తున్న ఫోన్‌ నుంచి పీవీ రమేశ్‌ కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు ఎందుకు వెళ్లాయి? మధ్యలో... పీవీ రమేశ్‌ కుటుంబం ఎందుకు వచ్చింది అనేదే అసలు విషయం! సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్‌ సతీమణి...పీవీ రమేశ్‌కు సొంత సోదరి. సునీల్‌కుమార్‌ దంపతుల మధ్య చాలారోజులుగా వివాదాలున్నాయి.  ఈవిషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా సునీల్‌ సతీమణి రఘురామను కోరినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. à°† నేపథ్యంలో సీఐడీ అదుపులో ఉన్న ఫోన్‌ ద్వారా రమేశ్‌ కుటుంబసభ్యులకు మెసేజ్‌లు వెళ్లడం పెద్దట్విస్ట్‌. à°ˆ మెసేజ్‌లు రఘురామనే పంపినట్లు భావించి, ఆమె స్పందిస్తే... à°† సందేశాలను తమకు అనుకూలంగా వాడుకోవచ్చుననే ఆలోచనతోనే ఇలాచేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.