2.5 లక్షల కాంట్రాక్టు సిబ్బందికి మోసం

Published: Sunday June 13, 2021

ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును, వారి చదువును  పరిగణనలోకి తీసుకుని వీలయినంత మంది ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తాం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమానం జీతం ఏర్పాటు చేస్తాం’’.. ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వస్తే చేస్తామని విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ చేర్చారు. ఉద్యోగ విధులు.. కూలీ బతుకు అన్నట్టు ఉన్న దుస్థితితప్పి ఎప్పటికి రెగ్యులర్‌ అవుతామా అని ఆశపడుతు న్న కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఇప్పటికీ ఎదురుచూపులే! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షలమంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సుమారు లక్ష మందికిపైగా వివిధ శాఖల్లో కాంట్రాక్టు సేవలు అందిస్తున్నారు. ఎన్నికలహామీలు ఎప్పుడు అమలు చేస్తారని రెండేళ్లుగా వీరంతా ప్రభుత్వాన్ని నిలదీస్తూనేఉన్నారు. కమిటీల నియామకం, ఉన్నతస్థాయి సమీక్షలను దా టని సర్కారు స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

 

వేర్వేరు కారణాలతో ఉద్యోగ నియామకాలను వెంటనే చేపట్టలేని పరిస్థితి! విభాగాల్లో చూస్తే బోలేడు పనిభారం! మధ్యేమార్గంగా కాంట్రాక్టు ప్రాతిపదికగా అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం 1999లో రాష్ట్రంలో మొదలైంది. తొలుత వైద్యఆరోగ్య, విద్య, కార్మిక, పంచాయతీరాజ్‌శాఖల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు జరిగాయి. రూల్‌ఆఫ్‌ రోస్టర్‌ పాటిస్తూ కొందరిని నియమిస్తే.. రాత పరీక్షల్లో మెరిట్‌ తెచ్చుకొన్నవారినీ, టెక్నికల్‌ సర్టిఫికెట్లు, సీనియారిటీకి వెయిటేజ్‌ పొందినవారినీ, మెరిట్‌ ప్రాతిపదికన పనిచేసే ప్రదేశాలకు కౌన్సిలింగ్‌ నిర్వహించి గుర్తించినవారినీ, శాఖాపరమైన శిక్షణ పూర్తిచేసిన వారినీ.. పరిగణనలోకి తీసుకుని నియమించారు. ప్రభుత్వం మంజూరుచేసిన పోస్టుల స్థానంలోనే వీరందరినీ నియమించారు. ఈలక్షమందిలో వైద్య ఆరోగ్యశాఖలోని మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టు, స్టాఫ్‌నర్స్‌, ఇతర కేడర్ల వారు అత్యధికంగా 21 వేల మంది ఉంది. ఇక విద్యాశాఖలో జూనియర్‌ లెక్చరర్లుగా 3746 మంది పనిచేస్తున్నారు. వీరిని త్రిసభ్య, ఆర్జేడీ సంయుక్త కమిటీ ద్వారా నియమించారు. క్రమబద్ధీకరణ లెక్చరర్లకు ఇచ్చే జీతంలో బేసిక్‌ పే కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లకు ఇస్తున్నారు. ఇక..ప్రత్యేక ఉపాధ్యాయులు 1320 మందిని  ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియమించారు. డీఎస్సీ చేసిన ఎందరో వేరు వేరు జిల్లాల్లో కాంట్రాక్టు టీచర్లుగా పనిచేస్తున్నారు. 2006లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో ఇంజనీరింగ్‌ విభాగంలో జోనల్‌ స్థాయిలో చీఫ్‌ ఇంజనీర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నియమించిన సైట్‌ఇంజనీర్లుగా 194 మంది, కార్మికశాఖలో సుమారు వెయ్యి మంది ఉన్నారు. ఇంత మందిలో ప్రభుత్వం 34 వేల మందిని మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తిస్తోంది. క్రమబద్ధీకరించాలని ఉద్యోగ సంఘాలు వీరి కోసమే పోరాడుతున్నాయి. 

 

2014లో అధికారంలోకి రాకముందు టీడీపీ కూడా కాంట్రాక్టు ఉద్యోగులకు హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన తెచ్చిన సమస్యలు, కొత్తరాజధానికి తీర్చాల్సిన అవసరాలు. వీటన్నింటికీ అవసరమైన ఆర్థిక వనరులు! ఇలా అధికారంలోకి వచ్చినరోజు నుంచీ చంద్రబాబు సర్కారుకు అన్నీ సమస్యలే! అయినా, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడుగు ముందుకు పడింది. à°ˆ అంశంపై పరిశీలన కోసం అప్పటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది. అనేక దఫాలు ఉపసంఘం సమావేశమె దేశంలోని పలురాష్ట్రాల నుంచి సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించింది. న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని à°ˆ క్రమంలో గుర్తించారు. ‘‘1993 నవంబరు తర్వాత విధుల్లోకి వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణను అమలు చేయడం వీలుకాదు’’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. à°ˆ పరిస్థితుల్లో కాంట్రాక్టు సిబ్బందికి మెరుగైన జీతాలు, ఇతర ప్రోత్సాహకాలు అందించాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులు వెంటనే కార్యరూపం దాల్చాయి. పలు శాఖల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా వేతనాలు పెరిగాయి.