7 మామిడి కాయలు.. నలుగురు గార్డులు.. ఆరు కుక్కలు!

Published: Friday June 18, 2021

సాధారణంగా మామిడి తోటకు ఒకరో, ఇద్దరో కాపలా ఉంటారు. అక్కడ మాత్రం ఏడంటే ఏడే మామిడి కాయలున్న రెండు చెట్ల వద్ద నలుగురు వ్యక్తులు, ఆరు శునకాలతో కాపలా కాస్తున్నారు. ఇంత భద్రత ఎందుకంటారా? à°† à°°à°•à°‚ మామిడి పండ్లకు బంగారమంత విలువ ఉంది మరి. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌కు చెందిన రాణి, సంకల్ప్‌ దంపతుల తోటలో à°ˆ చెట్లున్నాయి. ఇవి జపాన్‌లోని మియాజాకి ప్రాంతానికి చెందిన అరుదైన రకానికి చెందిన మామిడి చెట్లు. అందుకే à°ˆ చెట్లకు కాసిన మామిడి పండ్లకు మియాజాకి పేరు స్థిరపడింది. à°ˆ పండ్లు రూబీ కలర్‌లో ఉంటాయి. ఒక్కో పండు బరువు 350 గ్రాములు. కిలో పండ్ల ధర ఏకంగా రూ.2.7 లక్షలు. ఓసారి రైలు ప్రయాణంలో à°ˆ దంపతులకు à°“ వ్యక్తి à°ˆ అరుదైన మొక్కలు ఇచ్చారట.