సీమ ఎత్తిపోతల కేసులో ఏపీకి ఎన్‌జీటీ హెచ్చరిక

Published: Saturday June 26, 2021

 à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£ అనుమతులు లేనిదే రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టవద్దన్న తమ ఆదేశాలను ధిక్కరించి.. పనులు చేస్తున్నారని తేలితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) హెచ్చరించింది. తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని కృష్ణా బోర్డుకు, కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలు జారీచేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా à°ˆ ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని గతంలో ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి పనులు కొనసాగిస్తున్నారంటూ తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ దాఖలుచేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఎన్‌జీటీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సత్యగోపాల్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తమకున్న సమాచారం ప్రకారం.. అక్కడ పనులు జరగడం లేదని ఏపీప్రభుత్వం తరఫున న్యాయవాది దొంతి మాధురీరెడ్డి తెలిపారు. రెండు వారాలు సమయం ఇస్తే వివరాలు సమర్పిస్తామని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘రెండు వారాల పాటు సమయం ఇస్తే ఏం చేస్తారు..? పనులు జరగడం లేదనే చెబుతారుగా..! పనులు జరక్కపోతే ఇన్నిసార్లు ధిక్కరణ పిటిషన్‌ను ఎందుకు దాఖలుచేస్తారు’ అని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లాను అమలు చేయడం లేదని, ట్రైబ్యునల్‌ తీర్పును ఉల్లంఘించి పనులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పనులకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనానికి చూపించారు. ఏపీ న్యాయవాది స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వమే అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, తాము కూడా కేసులు వేస్తామని చెప్పారు. 

 

à°ˆ కేసు గురించే వాదనలు వినిపించాలని, ఇతర అంశాలకు వెళ్లవద్దని ట్రైబ్యునల్‌ సూచించింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ కృష్ణాబోర్డు అధికారులను సీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించనివ్వడం లేదని.. ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. à°ˆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమని ట్రైబ్యునల్‌ తీర్పు ఇస్తే.. అక్కర్లేదంటూ కేంద్ర పర్యావరణ శాఖకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు చేస్తోందని చెప్పారు. ఇలా దరఖాస్తు చేసిందో లేదో పర్యావరణశాఖను అడగాలని.. దరఖాస్తు చేస్తే దాని స్థితి ఏమిటో తెలసుకోవాలని కోరారు. పనులు జరుగుతున్నాయో లేదో తెలుసుకోడానికి కృష్ణాబోర్డు బృందాన్ని పంపిస్తామని ధర్మాసనం తెలిపింది. పర్యావరణ శాఖ కమిటీని కూడా పంపించాలని à°Ÿà°¿. ప్రభుత్వ న్యాయవాది కోరారు. తమ తీర్పులు ఉల్లంఘిస్తున్నారని తేలితే మాత్రం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపుతామని.. ఏవైనా తప్పులు చేస్తే తెలంంగాణకు కూడా ఇదే వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. చివరకు.. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా స్థితిగతులను తనిఖీ చేసి నివేదిక అందించాలని కృష్ణా బోర్డును, కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.