వితంతు, ఒంటరి పెన్షన్‌దారులకు చెక్‌

Published: Friday July 02, 2021

నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టడానికి à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైఎ్‌సఆర్‌ పెన్షన్‌ కానుక పొందుతున్న లబ్ధిదారులకు అధికారులు నోటీసులు అందిస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. ప్రతినెలా ఏదో à°’à°• జిల్లాలో పింఛను పొందుతున్న వితంతువులకు నోటీసులు వస్తున్నాయి. ఇటీవల రేషన్‌ కార్డులకు సంబంధించి సర్వే చేపట్టారు. పలు రేషన్‌ కార్డుల్లో చనిపోయిన వారి పేరు తొలగించకుండా ఏళ్ల తరబడి రేషన్‌ విడుదల చేస్తున్నారు.

కొన్నిచోట్ల అయితే లబ్ధిదారులకు తెలియకుండానే డీలర్లు రేషన్‌ను స్వాహా చేసేవారు. తాజాగా చేపట్టిన సర్వేలో కార్డులో భర్త పేరుందని, రేషన్‌ కూడా పొందుతున్నారన్న కారణం చూపుతూ వితంతు పెన్షన్‌ పొందేందుకు అర్హత లేదని నోటీసులిస్తున్నారు. దీంతో భర్త డెత్‌ సర్టిఫికెట్‌ తీసుకుని అప్‌లోడ్‌ చేయడం కోసం పెన్షన్‌దారులు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. à°’à°‚à°Ÿà°°à°¿ మహిళల కోటాలో పెన్షన్‌ పొందుతున్న వారికి కూడా ఇదే చిక్కులు వచ్చిపడ్డాయి. రేషన్‌కార్డులో భర్త పేరు ఉండటం, ఆయనకు కేటాయించిన సరుకులు కూడా పొందుతుండటంతో దంపతులు కలిసే ఉన్నారని అధికారులు ఆక్షేపిస్తున్నారు. భర్త పేరును కార్డులో నుంచి తొలగించేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవానికి రేషన్‌ కార్డులో పేరు తొలగించాల్సిన బాధ్యత అధికారులదే. అయితే à°† పని వారు చేయకుండా తమకు నోటీసులివ్వడమేంటని పలువురు పెన్షన్‌దారులు ప్రశ్నిస్తున్నారు. ఆధార్‌ కార్డులో వయసు ఎక్కువ చూపించి పెన్షన్‌ పొందుతున్నారని కొంతమందికి నోటీసులిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో దాదాపు 100మంది వితంతు, à°’à°‚à°Ÿà°°à°¿ మహిళలు పింఛన్లకు అర్హులు కారంటూ నోటీసులిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని గ్రామ, వార్డు వలంటీర్లను ఇళ్ల చుట్టూ తిప్పిన ప్రభుత్వం... మంజూరుచేసిన తర్వాత రకరకాల నిబంధనలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. à°•à°¡à°ª జిల్లాలోని చాలా గ్రామాల్లో చోటా నేతలు పెన్షన్‌ తొలగించేందుకు నిబంధనల సాకు చూపిస్తున్నారు. జీవో.174 ప్రకారం పెన్షన్‌కు అర్హులు కారంటూ ప్రొద్దుటూరులో కూడా పలువురికి నోటీసులిచ్చారు. à°ˆ జీవోను పక్కాగా అమలు చేస్తే భారీసంఖ్యలో పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉందని జీవో విడుదల చేసిన సమయంలోనే సర్వత్రా అభిప్రాయం వ్యక్తమైంది. లక్షల సంఖ్యలో పెన్షన్లు కోత పడితే దాని ప్రభావం స్థానికంపై పడుతుందని అప్పట్లో వాటిని అమలు చేయలేదు. ఇప్పుడు స్థానికం పూర్తి కావడంతో అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. 

 

వైసీపీ నేతల కన్నెకు గురైనవారి పెన్షన్‌ ఇట్టే కట్‌ అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి ఫలానా వారికి పెన్షన్‌ ఎందుకివ్వాలంటూ దబాయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ పెన్షన్‌దారులపై నేతలు బెదిరింపులకు సిద్ధపడ్డారు. కొన్ని గ్రామాల్లో తాము చెప్పినట్లు చేయకపోతే వలంటీర్లను కూడా తొలగించి ఇంటికి పంపుతున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితి తయారవడంతో ఇష్టమున్నా, లేకపోయినా వారు ఆడించినట్లుగా ఆడాల్సి వస్తోందంటున్నారు. విద్యుత్‌ చార్జీలు 300 యూనిట్లు దాటినా, వారి పేరున పట్టణాల్లో స్థలాలున్నా, భూమి 10 ఎకరాలు దాటినా పెన్షన్‌కు అర్హులు కారంటూ నిబంధనలున్నాయి. à°ˆ నిబంధనలను తమకు అవసరమైన చోట అన్వయించుకుని, మిగిలినచోట్ల చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.