పేదలకు భారంగా గృహ నిర్మాణాలు

Published: Saturday July 03, 2021

జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 4 విడతల్లో రూ.1.80 లక్షలు చెల్లిస్తుంది. నిర్మాణానికి అవసరమైన  90 కట్టల సిమెంట్‌, 482 కిలోల ఇనుము అందిస్తారు. వీటికి సంబంధించిన మొత్తాన్ని రూ.1.80 లక్షల్లో మినహాయించి మిగిలిన మొత్తాన్నే చెల్లిస్తారు. లబ్ధిదారుడికి బేస్‌మెంట్‌ సమయంలోనే చేతి చమురు వదులుతుంది. ఇసుక ఉచితమంటున్నారే కాని అది అందడం అనుమానమే. బేస్‌మెంట్‌ కోసం అవసరమైన రూ.50 వేల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో చూపించాలని కొన్ని ప్రాంతాల్లో వలంటీర్లు లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. అంతమొత్తంలో ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.  

ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకోండి లేకుంటే à°ˆ స్థలాన్ని వెనక్కు తీసుకుంటామంటూ అధికారులు లబ్ధిదారులను హెచ్చరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వలంటీర్ల ద్వారా ఫోన్లు చేయించి మరీ ఇంటి నిర్మాణాలపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరైతే ఏకంగా ఇళ్లకు వెళ్లి మరీ లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు సమాచారం. మొదట మూడు ఆప్షన్లు ఇచ్చి ఇప్పుడు కాదుకాదు ఎవరి ఇల్లు వారే కట్టుకోవాలనడం పేదలపై భారం మోపడమేనని పలువురు లబ్ధిదారులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏమి చేయాలో అర్థంకాని అయోమయ, ఆందోళనకర పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నారు. 

అధికారుల ఒత్తిడితోనో.. స్థలం రద్దు అవుతుందనో  ఇంటి నిర్మాణం చేపడితే అప్పుల పాలవడం ఖాయమని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల్లో 90 కట్టల సిమెంటు, 482 కిలోల ఇనుముకు నగదు మినహాయించుకోగా మిగిలిన మొత్తంలో నిర్మాణం కష్టమే అంటున్నారు. అడుగు కట్టుబడికి రూ.250 చొప్పున  380 అడుగులకు మేస్త్రీ కూలీకే రూ.95 వేలు అవుతుంది. మిగిలిన మొత్తంతో గృహనిర్మాణం కష్టమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటికి సుమారు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వ్యయం అవుతుందని అంటే రూ.2.50 లక్షలు  అప్పులు చేయాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. 

 

 

జిల్లాలో పేదలకు ఇళ్ల పథకం à°•à°¿à°‚à°¦ సుమారు 2.84 లక్షల మందికి జగనన్న కాలనీల లేఅవుట్లలో నివేశన స్థలాలు పంపిణీ చేశారు. ఇప్పుడు వాటిల్లో ఇళ్లు కట్టుకోమని ప్రభుత్వం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఇప్పటికే శంకుస్థాపనల కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం మెగా గ్రౌండింగ్‌ మేళాల పేరుతో ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులతోనే ప్రారంభింప చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలి విడతలో దాదాపుగా లక్షా 61 వేల గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా జాయింట్‌ కలెక్టర్‌ను నియమించి బాధ్యతలు కూడా కేటాయించారు. అయితే లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడంలేదు. పెరిగిన ధరలు, అనుకూల ప్రాంతాల్లో లేకపోవడం, ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోకపోవడం తదితర కారణాలతో ఇంటి నిర్మాణాలకు వెనుకంజ వేస్తున్నారు. à°ˆ పరిస్థితుల్లో గ్రౌండింగ్‌ మేళా పేరుతో చేపట్టిన కార్యక్రమాలకు లబ్ధిదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగా ఉంది. ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇస్తుందనే ఆప్షన్‌ను ఎక్కువమంది ఎంపిక చేసుకున్నారు. అయితే à°ˆ పని కష్టమని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. à°ˆ పరిస్థితుల్లో లబ్ధిదారుడే నిర్మించుకోవాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అదేమంటే మీరే కట్టుకుంటే ఎలాంటి లోపాలు ఉండవు అంటూ తప్పించుకుంటున్నారు. డబ్బులున్నవారు నిర్మాణాలు వేగవంతం చేస్తే కొంతమంది ప్రారంభించి వదిలేస్తున్నారు.