విమానాశ్రయంలో షాకింగ్ ఘటన..

Published: Saturday July 03, 2021

తమిళనాడులోని అరుపుకోటాయ్ ప్రాంతానికి చెందిన à°“ వ్యక్తికి పోలాండ్ దేశం నుంచి à°“ పార్శిల్ వచ్చింది. à°† పార్శిల్‌‌పై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూస్తే, అందులో 107 ప్లాస్టిక్ వయల్స్ కనిపించాయి. à°† వయల్స్‌లో సాలెపురుగులు ఉన్నాయి. దీంతో à°† సాలెపురుగుల కథేంటో తేల్చడానికి కస్టమ్స్ అధికారులు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(డబ్ల్యుసిసిబి), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (SRC) అధికారులు, ఇతర శాస్త్రవేత్తలను పిలిపించారు. సుదీర్ఘ పరీక్షల అనంతరం à°† సాలెపురుగులు ఫోనోపెల్మా మరియు బ్రాచిపెల్మా జాతికి చెందినవనిగా గుర్తించారు. ఇవి దక్షిణ, మధ్య అమెరికా, మెక్సికో ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయని వెల్లడించారు.

అలాంటి జాతులను భారత్‌కు దిగుమతి చేసుకోవడం చట్ట విరుద్ధం కాబట్టి.. వెంటనే à°† సాలెపురుగులు ఉన్న పార్శిల్‌ను వెనక్కు పంపించేయాలని అధికారులు సూచించారు. దీంతో à°† పార్శిల్‌ను చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులకు అందించారు. దాన్ని వెనక్కు పంపించే ప్రక్రియను చేపట్టారు. అదే సమయంలో అది ఎవరి అడ్రస్‌కు అయితే చేరాల్సి ఉందో, à°† వివరాలను ఆరా తీస్తున్నారు. అతడు ఎందుకు వీటిని ఆర్డర్ ఇచ్చాడన్నది తేల్చాల్సి ఉంది.