కూలిన బ్రిడ్జి పిల్లర్.. ఇద్దరు మృతి

Published: Tuesday July 06, 2021

నగరంలో ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలికి అధికార యంత్రాంగం చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టారు. అనకాపల్లి దగ్గర ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. అయితే ఫ్లై ఓవర్ సైడ్ బీమ్‌లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో కింద ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు మృతి చెందారు.