రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌

Published: Tuesday July 06, 2021

à°’à°•à°Ÿà°¿ కావాలంటే...మరొకటి వదులుకోవాలి. ఇదీ ప్రస్తుతం విశాఖపట్నంలో రైల్వే పరిస్థితి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కావాలని à°ˆ ప్రాంత ప్రజలు చేసిన పోరాట ఫలితంగా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ను రెండేళ్ల క్రితం ప్రకటించారు. అయితే à°ˆ ప్రక్రియ వేగవంతం కాలేదు. సహజంగానే రైల్వేలో జోన్‌ ప్రకటించిన తరువాత పూర్తిస్థాయి కార్యకలాపాలు జరగడానికి నాలుగైదేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం భువనేశ్వర్‌ కేంద్రంగా వున్న తూర్పు కోస్తా రైల్వేజోన్‌ను 1996-97లో ప్రకటించారు. అది 2003 నాటికి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. విశాఖలో దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటుకూ అదేవిధంగా కొంత సమయం పడుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కొత్త జోన్‌ వస్తుందా?, రాదా?...అనే అనుమానం అవసరం లేదు. à°ˆ జోన్‌కు à°—à°¤ రెండు బడ్జెట్లలో నిధులు కేటాయించారు. మొదటి ఏడాది రూ.3 కోట్లు, à°† తరువాత రూ.40 లక్షలు. ఇవి నామమాత్రపు నిధులే. ప్రక్రియ ముందుకు సాగడానికి ఇవన్నీ ప్రాథమిక అంశాలు.

 

వాల్తేరు డివిజన్‌ రాయగడకు తరలింపు

కొత్త జోన్‌ కార్యాచరణ ప్రక్రియ ముందుకుసాగాలంటే..ముందు విభజన అంశాల్లో భాగంగా ‘వాల్తేరు రైల్వే డివిజన్‌’ రద్దు చేయాలి. ఇకపై à°ˆ డివిజన్‌ కొనసాగదు. ఇందులో విశాఖపట్నం సహా విజయనగరం, చీపురుపల్లి వరకు విజయవాడ డివిజన్‌లో కలిసిపోతాయి. విజయవాడ డివిజన్‌ దక్షిణ కోస్తా జోన్‌లోకి వస్తుంది. ఇక వాల్తేరు డివిజన్‌లో మిగిలిన ఒడిశా ప్రాంతాలు కోరాపుట్‌, రాయగడ, కిరండోల్‌ వంటివి కొత్తగా ఏర్పాటయ్యే ‘రాయగడ డివిజన్‌’లోకి వెళ్లిపోతాయి. à°ˆ మేరకు రాయగడలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. à°ˆ ప్రక్రియ పూర్తయ్యాకే కొత్త జోన్‌ పనులు మొదలవుతాయి.

 

ఆరు నెలల్లో డీపీఆర్‌కు ఆమోదం

కొత్త జోన్‌ ఎలా వుండాలనే దానిపై గతంలో ఇక్కడ ఓఎస్‌డీగా పనిచేసిన అధికారులు రైల్వే బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించారు. రెండేళ్లు అవుతున్నా దానిని ఇంకా పరిశీలించలేదు. దీనిని ఆరు నెలల్లో పరిశీలించి, ఆమోదించే అవకాశం వుందని రైల్వే ఉన్నత వర్గాల సమాచారం. ఇందుకోసం ఖాళీగా వున్న ఓఎస్‌à°¡à±€ పోస్టులో చంద్రశేఖర్‌ అనే సీనియర్‌ అధికారిని రెండు వారాల క్రితం నియమించారు. ఈయన కొద్దిరోజుల్లోనే బాధ్యతలు స్వీకరించి, డీపీఆర్‌ ఆమోదం ప్రక్రియ వేగవంతం చేయనున్నారు.

 

కొత్త జోన్‌ ప్రకటించిన తరువాత అక్కడ à°“ జనరల్‌ మేనేజర్‌(జీఎం)ను నియమించే సంప్రదాయం ఉంది. à°ˆ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో జీఎం నియామకం అంశం ప్రస్తావిస్తారు. ప్రస్తుతం జోన్లకు జీఎంలను నియమించే ప్రక్రియ నడుస్తోంది. à°ˆ విడత విశాఖలో కొత్త జోన్‌కు జీఎంను నియమించడం లేదు. వచ్చే ఏడాది à°ˆ పోస్టును భర్తీ చేసి, కొత్త అధికారిని నియమిస్తారు. వీలైనంత వేగంగా అంటే..వచ్చే ఎన్నికలకు ముందు విశాఖలో కొత్త జోన్‌ పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని బీజేపీ ఉన్నత వర్గాల సమాచారం.