భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు తరిగిపోతున్నాయి

Published: Friday July 16, 2021

పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న భీమిలి బీచ్‌రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి మట్టి, ఇసుక తరలించుకుపోతున్నారు. గతంలో చిన్న చిన్న వ్యాన్లలో, మినీ ఆటోల్లో మట్టి తీసుకుపోతుండేవారు. ఇప్పుడు ఏకంగా జేసీబీలతోనే తవ్వకాలు చేపట్టినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎర్రమట్టి దిబ్బలు సుమారు 1,195 ఎకరాల్లో విస్తరించి ఉండగా, వీటిలో 292 ఎకరాలను జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది. పురావస్తు, పర్యాటక శాఖల అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.