IDBIలో అసిస్టెంట్‌ మేనేజర్లు

Published: Thursday August 12, 2021

ముంబైలోని ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్‌ మేనేజర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొదట ఐడీబీఐ... మణిపాల్‌ (బెంగళూరు), నిట్టే(గ్రేటర్‌ నోయిడా) విద్యా సంస్థలతో కలిసి ఏడాది(9 నెలలు క్లాస్‌ రూం+3 నెలలు ఇంటర్న్‌షిప్) వ్యవధి à°—à°² పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్)లో శిక్షణ ఇస్తుంది. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం ఇస్తుంది.

 

మొత్తం ఖాళీలు: 650

అర్హత: à°•à°¨à±€à°¸à°‚ 60 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత

వయసు: 2021 జూలై 01 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

 

ఎంపిక విధానం: à°†à°¨à±‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: à°¦à±€à°¨à±à°¨à°¿ మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 0.25 చొప్పున మార్కు కట్‌ చేస్తారు. పరీక్షలో లాజికల్‌ రీజనింగ్‌, డేటా అనాలిసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 60 ప్రశ్నలు; ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 40; క్వాంటిటేటీవ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 40; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. 

 

దరఖాస్తు విధానం: à°†à°¨à±‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకి చివరి తేదీ: à°†à°—స్టు 22

పరీక్ష తేదీ: à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బరు 04

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à±‌, విజయవాడ, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/