ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ దీక్ష

Published: Monday June 18, 2018


à°•à°¡à°ª à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఈనెల 20 నుంచి ఆమరణదీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్‌ సమావేశ మందిర ఆవరణలో భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు పక్కన మరో వేదికను సిద్ధం చేస్తున్నారు. నిబంధనల మేరకు బిల్లులు చెల్లించి తాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌ను తీసుకున్నారు. రోజుకు 5వేల మందికి మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారు. ఉద యం, రాత్రి టిఫిన్‌ కూడా అందించనున్నారు.
 
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక వేదిక సిద్ధం చేస్తున్నారు. ఆవరణలో ఎక్కడా ఎగుడు దిగుడు లేకుండా చదను చేస్తున్నారు. వేపచెట్టు à°•à°¿à°‚à°¦ ఉన్న అరుగును సుందరీకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం హాజరు కానుండడంతో ఎవరికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రముఖుల కోసం ప్రత్యేక ఏ ర్పాట్లు చేస్తున్నారు. కాగా ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర à°•à°¾ ర్యదర్శి సీఎం సురే్‌షనాయుడు దగ్గరుండి పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆయనతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్‌, నాయకత్వ శిక్షణా తరగతుల డై రెక్టర్‌ రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ నేత సుభాన్‌బాష ఉన్నారు.