రేపటి నుంచే

Published: Sunday August 15, 2021

రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు సోమవారం నుంచి ప్రారం à°­à°‚ కానున్నాయి. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ము ఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. à°ˆ ఉత్తర్వులను అనుసరించి.. తరగతిలో 20మంది మాత్రమే ఉండి...విద్యార్థుల మధ్య ఆరడుగుల సామాజిక దూరం ఉండాలి. తరగతిలో ఎక్కువ మంది ఉంటే వారిని రెండు, మూడు బ్యాచ్‌లుగా చేయాలి. ఒక్కో బ్యాచ్‌లో 20మందికి మించరాదు.

 

ఒకవేళ గదులు సరిపోకుంటే.. కొన్ని తరగతులకు ఒకరోజు, మరికొన్ని తరగతులకు ఒకరోజు క్లాసులుండేలా ఏర్పాటుచేయాలి. ప్రతి వా à°°à°‚ ఒక్కో బ్యాచ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులకు, à°’à°• ఉపాధ్యాయుడికి కొవిడ్‌ పరీక్ష చేయాలి. వారికెవరికైనా పాజిటివ్‌ వస్తే...à°† బ్యాచ్‌లోని మిగతా అందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. మరోవైపు మధ్యాహ్న భోజనం కూడా అందరికీ ఒకేసారి కాకుండా...బ్యాచ్‌à°² వారీగాపెట్టాలి. ‘‘రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖతో కూడా మాట్లాడి...పాఠశాలలు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నాం. కొవిడ్‌ విషయం లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా అనుసరించాల్సి ఉంటుంది. హెడ్‌మాస్టరు కొవిడ్‌ నియంత్రణకు ప్రణాళికను రూపొందించుకోవాలి’’ అని కోరారు. ప్రతి విద్యార్థి కచ్చితంగా మాస్క్‌ పెట్టుకోవాలి. స్కూల్‌ ప్రవేశ ద్వారం వద్దే విద్యార్థు లు, సిబ్బంది ఉష్ణోగ్రతలు చెక్‌ చేయాలి. జలుబు, దగ్గులాంటి అనుమానాలున్నవారిని ఇంటికి పంపించేయాలి. స్కూల్‌ అసెంబ్లీ, ఆటలు నిర్వహించకూడదు.

రేపటి నుంచేపిల్లలను పాఠశాలలో దింపేందుకు వచ్చే తల్లిదండ్రులకు ఏవైనా కొవిడ్‌ లక్షణాలుంటే వారినీ పరీక్షకు పంపాలి. విద్యార్థులకు హ్యాండ్‌ శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలి. à°ˆ విషయంలో హెడ్‌మాస్టర్లు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవాలి. స్కూలు బస్సుల్ని సగం సామర్థ్యంతోనే నడపాలి. మరోవైపు ఉపాధ్యాయులంతా దగ్గరిలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కొవిడ్‌ టీకాలు వేయించుకోవాలి. ప్రతి పాఠశాలకు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేయాలి. కాగా, ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరక్టర్‌ నిబంధనలు రూపొందించి పంపించాలి. 

రాష్ట్రంలో థర్డ్‌వేవ్‌ సూచనలు కనిపిస్తున్నాయి. పదిజిల్లాలో రెండుశాతం కంటే ఎక్కువే పాజిటివిటీ రేటు ఉంది. ఇందులో ఐదు జిల్లా లు ‘ప్రమాదం’లో ఉన్నాయి. à°ˆ పరిస్థితుల్లో స్కూళ్లు తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై పిల్లల తల్లిదండ్రులతోపాటు వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌కు ముందు కూడా ప్రభు త్వం ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేస్తున్నారు. కరోనా కేసుల తగ్గుముఖం పట్టాయని స్కూళ్లతోపాటు అన్ని రకాల కార్యకాలాపాలకు అప్పట్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రజలు కూడా కొవిడ్‌ నిబంధనలు పక్కనపెట్టారు. అంతే.. సెకండ్‌ వేవ్‌  బీభ త్సం సృష్టించింది. అవే తప్పులను ప్రభుత్వం థర్డ్‌ వేవ్‌కు ముందు చేస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. కాగా, థర్డ్‌వేవ్‌ ఆగస్టు-సెప్టెంబరు మధ్య రాష్ట్రాన్ని ముంచెత్తనున్న దృష్ట్యా పాఠశాలలను ప్రారంభించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదావేసుకోవాలని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు రమణయ్య, కామేశ్వరరావు డిమాండ్‌ చేశారు. వేదిక తరఫున సీఎం జగన్‌కు లేఖ రాశారు.