తన కుటుంబం గురించి రషీద్‌ఖాన్ ఆందోళన

Published: Monday August 16, 2021

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై à°† దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆందోళన చెందుతున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. ఆఫ్ఘాన్‌లో ఉన్న తన కుటుంబాన్ని దేశం నుంచి బయటకు రప్పించలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ (హెచ్‌కేఐ) విమానాశ్రయానికి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. రషీద్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ప్రారంభ ‘హండ్రెడ్’ ఎడిషన్‌లో ట్రెంట్ రాకెట్స్ తరపున ఆడుతున్నాడు.  

 

రషీద్‌ స్వదేశంలో ప్రస్తుతం చాలా విషయాలు జరుగుతున్నాయని, ఇక్కడ తాము à°† విషయాల గురించి మాట్లాడుకుంటున్నామని పీటర్సన్ పేర్కొన్నాడు. స్వదేశంలోని పరిస్థితులపై రషీద్ ఆందోళన చెందుతున్నాడని పేర్కొన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకుపోయిన తన కుటుంబాన్ని దేశం దాటించలేకపోవడం ఆవేదన చెందుతున్నాడని అన్నాడు. రషీద్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని అన్నాడు. అయితే, ప్రస్తుతం à°† విషయాన్ని మర్చిపోయి ముందుకు సాగగలడని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల వశమైన సంగతి తెలిసిందే.