రంగంలోకి హరిత ట్రైబ్యునల్‌ కమిటీ నేడు మైనింగ్‌ ఏరియాలో పరిశీలన

Published: Wednesday August 18, 2021

విశాఖలో లేటరైట్‌ తవ్వకాల నిగ్గు తేల్చేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నియమించిన విచారణ కమిటీ రంగంలోకి దిగుతోంది. బుధవారం à°ˆ కమిటీ విశాఖజిల్లా నాతవరం మండలం భమిడికలొద్దిని సందర్శించనుంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎల్లమురుగన్‌, సైంటిస్టు సురేశ్‌బాబు మంగళవారం సాయంత్రం విశాఖ నగరానికి చేరుకున్నారు. వీరితోపాటు జిల్లా కలెక్టర్‌ à°Ž.మల్లికార్జున, డీఎ్‌ఫవో అనంతశంకర్‌, గనుల శాఖ డీడీ సూర్యచంద్ర, కాలుష్య నియంత్రణ మండలి విశాఖ ఈఈ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, సర్వే ల్యాండ్‌ రికార్డ్సు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కుమార్‌ తదితరులు భమిడికలొద్ది వెళ్లనున్నారు. లేటరైట్‌ తవ్వకాల కోసం అటవీ, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినట్టు నాతవరం మండలం గునుపూడికి చెందిన మరిడయ్య జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయడంతో, విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

 

లేటరైట్‌ తవ్వకాల వల్ల అటవీ ప్రాంతంలో విలువైన చెట్లు పోవడంతోపాటు వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా తవ్వకాలు, రవాణా సమయంలో వచ్చే ధూళితో పరిసర గ్రామాల ప్రజలు చర్మ, ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతారని, పంటలు దెబ్బతింటాయని, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా లేటరైట్‌ను తరలించడానికి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు రిజర్వు ఫారెస్టులో రహదారి నిర్మించారని, ఇందుకోసం వేలాది చెట్లు నరికి వేశారని మరిడయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

అటవీ, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించింది. à°ˆ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. విచారణ ప్రక్రియలో ఫిర్యాదుదారుని భాగస్వామ్యం చేస్తూ...అతని వద్ద వివరాలు తీసుకోవాలని కమిటీని ఆదేశించింది. ఎన్జీటీకి ఆఽధారాలు సమర్పించేందుకు మరిడయ్య సిద్ధంగా ఉన్నారు. భమిడికలొద్ది నుంచి జల్దాం వరకు పలుచోట్ల రిజర్వు అడవిలో రహదారి వేశారని, ఇందుకు లీజుదారుకి రెవెన్యూ, సర్వే, అటవీ శాఖ అధికారులు సహకరించారని ఫిర్యాదుదారు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. 

కమిటీ విచారణకు వస్తోందని తెలుసుకున్న లీజుదారు బినామీలు కొద్దిరోజుల నుంచి తవ్వకాలను నిలిపివేశారు. లేటరైట్‌ తవ్వకాలు, రహదారి నిర్మాణం కోసం తొలగించిన భారీవృక్షాలు కమిటీ కంటపడకుండా ఇప్పటికే అక్కడ నుంచి తరలించేశారు. చిన్నచిన్న కొమ్మలను మాత్రమే రోడ్డుకు ఇరువైపులా ఉంచారు. కమిటీ పూర్తిస్థాయిలో విచారణ చేపడితే అక్రమార్కుల బండారం బయటపడుతుందని సరుగుడుకు చెందిన కొందరు గిరిజన నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. అటవీ, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించారంటూ గతంలో సుందరకోట వద్ద లేటరైట్‌ తవ్వకాలను లోవరాజు అనే వ్యక్తి పొందిన అనుమతులను హైకోర్టు నిలిపివేసింది. అప్పట్లో లోవరాజు ఏఏ నిబంధనలు ఉల్లంఘించారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరిగాయంటున్నారు. à°ˆ దిశగా విచారణ చేపట్టాలని గిరిజన నాయకులు కోరుతున్నారు.