కేఆర్‌ఎంబీని విశాఖకు తరలించే యోచన!

Published: Thursday August 19, 2021

ఏపీ విభజన సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఆంధ్రప్రదేశలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విభజన జరిగి ఏడేళ్లు దాటినా à°† దిశగా చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి కేఆర్‌ఎంబీని ఏపీలో భాగంగా రాయలసీమలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తూ ఉంది. అయితే చివరికి ఏపీ ప్రభుత్వం దీన్ని విశాఖకు తరలించాలనుకుంటోంది. తెలంగాణ, ఏపీల మధ్య నీటి కేటాయింపులను పంపిణీ చేసే అధికారం కేఆర్‌ఎంబీకి ఉంది. అలాగే ఏపీలో కూడా రెండు ప్రాంతాల మధ్య నీటి పంపిణీలో వెనుకబడిన రాయలసీమ అవసరాలు à°ˆ బోర్డు పరిధిలోకి వస్తాయి. కృష్ణా నదిపై బోర్డు తీసుకునే నిర్ణయాలన్నీ రాయలసీమతోనే ముడిపడుతున్నాయి. అలాగే కర్నూలులో అయితే తెలంగాణకు అనుకూలంగా ఉంటుంది.

శ్రీశైలం రిజర్వాయర్‌ కేంద్రంగా అటు తెలంగాణ, ఏపీ కృష్ణాజలాలు వాడుకుంటున్నాయి. అలాగే పోతిరెడ్డి పాడు నుంచి రాయలసీమతోపాటు నెల్లూరు, చెన్నైకి కూడా నీరు సరఫరా అవుతోంది. à°ˆ రెండూ జిల్లాలో ఉన్నాయి. దీంతో కేఆర్‌ఎంబీని కర్నూలులో ఏర్పాటు చేయడం న్యాయమనే వాదన చాలా కాలంగా ఉంది. వైఎస్‌ జగనమోహన రెడ్డి ప్రభుత్వం దీన్నంతా విస్మరించి కృష్ణానదితో, కృష్ణా జలాల పంపిణీ వ్యవస్థలతో ఏ సంబంధంలేని వైజాగ్‌లో కేఆర్‌ఎంబీని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ప్రతి నీటి సంవత్సరంలో ఏదో à°’à°• రూపంలో అధిక శాతం నీరు నాగార్జునసాగర్‌కు వెళ్లిపోతోంది. రెండేళ్లుగా తెలంగాణ విద్యుదుత్పత్తి ద్వారా ఏడు జిల్లాలకు తాగు, సాగు నీటిగా ఉపయోగపడాల్సిన నీరు వృథాగా పోతోంది. 2020-21 నీటి సంవత్సరంలో 10 టీఎంసీలు తోడేసినప్పుడు, 52 టీఎంసీలు మళ్లించిన సమయంలో కేఆర్‌ఎంబీ గతంలో స్పందించింది. అలాగే 2021-2022లోనూ అదే పద్ధతిని తెలంగాణ అనుసరిస్తోంది. పలుమార్లు కేఆర్‌ఎంబీ హెచ్చరించినా తెలంగాణ ప్రభుత్వం వైఖరిలో మార్పు రాలేదు. పైగా తాము చేసేదే సరైనదన్నట్లుగా అక్కడి నాయకులు అంటున్నారు. అయినా ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫలితంగా ఇటీవలి వరదలు రాక ముందు దాకా తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం నీటిని తోడుతూనే ఉంది.

కృష్ణా నదీ జలాలపై ఆదేశాలే తప్ప కేఆర్‌ఎంబీకి అజమాయిషీ లేని కారణంగానే ఈదుస్థితి ఏర్పడింది. శ్రీశైలం డ్యాం ఎగువ ప్రాంతంలో ఎక్కడా నీటి నిల్వ రిజర్వాయర్లు లేకపోవడంతో à°ˆ సమస్య ఏటా తలెత్తుతూనే ఉంది. చంద్రబాబునాయుడు పునాది వేశారన్న కారణంగా గుండ్రేవుల ప్రాజెక్టును à°ˆ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా రాయలసీమ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసింది. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి à°† ప్రాజెక్టుకు ఇప్పటికైనా మోక్షం కలిగిస్తే రాబోయే నీటి సంవత్సరాల్లోనైనా సీమ ప్రజలకు, రైతాంగానికి à°ˆ నీటి వివాదాలు తప్పుతాయి. 

 

2019-20లో సుమారు 74 టీఎంసీల వరద నీటిని పెన్నా ద్వారా నెల్లూరు జిల్లాకు తరలించారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి కృష్ణా బేసినలో భాగమైన తుంగభద్ర, వేదవతి, హంద్రీ నదుల నీటిని టీజీపీ ద్వారా కర్నూలు, à°•à°¡à°ª, నెల్లూరు జిల్లాల మీదుగా చెన్నై వాసుల తాగు నీటి అవసరాలను అందిస్తున్నారు. అలాగే ఎస్‌ఆర్‌బీసీ పథకం కర్నూలు, à°•à°¡à°ª జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తోంది. ఎస్కేప్‌ ఛానెల్‌ కేసీ కాలువకు, కుందూ, పెన్నా నదుల ద్వారా పెన్నా నదికి నీటిని తరలిస్తుంది. ఏటా తెలుగు à°—à°‚à°— ప్రాజెక్టు, ఎస్కేప్‌ ఛానెల్‌ ద్వారా కృష్ణా, తుంగభద్ర నీళ్లను నెల్లూరు జిల్లాకు మళ్లిస్తున్నారు. 2019-20 సంవత్సరంలో సుమారు 74 టీఎంసీల వరద నీటిని పెన్నా ద్వారా నెల్లూరు జిల్లాకు తరలించారు. ఇలా అనేక ప్రాంతాలకు కర్నూలు జిల్లా నుంచే నీటి విడుదల జరుగుతున్నా జిల్లాలో మాత్రం నీటి ఎద్దడి తాండవిస్తోంది. à°ˆ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ కర్నూలులో ఉంటేనే అన్ని జిల్లాలకు సమ న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కేసీ కెనాల్‌ à°•à°¿à°‚à°¦ 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ తుంగభద్రకు వచ్చే వరదను నిల్వ చేసుకునేందుకు ఎక్కడా రిజర్వాయర్లు లేవు. ఫలితంగా ఖరీఫ్‌, రబీ రెండు కాలాల్లోనూ à°† ఆయకట్టుకు పూర్తిస్థాయి నీటిని అందించలేని దుస్థితి ఏర్పడుతోంది. కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ ద్వారా 31.09 టీఎంసీల కేటాయింపులున్నాయి. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయడానికి కేవలం 1.20 టీఎంసీల సామర్థ్యంగల సుంకేసుల తప్ప ఇంకోటి లేదు. దీంతో నీరంతా కింది ప్రాంతాలకు పోతోంది. à°ˆ సమస్యకు పరిష్కారంగా సుంకేసులకు పైన సి.బెళగల్‌ మండలంలో 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు 2012లో వెలుగులోకి వచ్చింది. à°ˆ ప్రాజెక్టుతో 6 లక్షలకు పైబడ్డ కర్నూలు కార్పొరేషన పరిధిలోని ప్రజలకు, జిల్లాలోని పశ్చిమ ప్రాంత 8.50 లక్షల మంది తాగునీటి అవసరాలకు ఉపయోగించవచ్చు. ప్రాజెక్టు లేని కారణంగా ఏటా సుంకేసుల నుంచి శ్రీశైలం డ్యామ్‌కు వందలాది టీఎంసీల నీరు వెళ్లి కింది ప్రాంతాలకు తరలిపోతోంది. 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు, 4 టీఎంసీల సామర్థ్యంతో కోసిగి మండల సమీపంలో ఆర్డీఎస్‌ ప్రాజెక్టు, హాలహర్వి మండలం గూళ్యం వద్ద 8 టీఎంసీల సామర్థ్యంతో వేదవతి, 40 టీఎంసీల సామర్థ్యంతో సిద్ధేశ్వరం అలుగు ఇలా అనేక ప్రాజెక్టుల ప్రణాళికలు ఉన్నాయి. వాటిలో వేదవతి, ఆర్డీఎ్‌సకు à°—à°¤ ప్రభుత్వంలోనే రూ.4వేల కోట్ల అంచనాలతో టెండరు ప్రక్రియ పూర్తయి ఒప్పందాల దశకు చేరాయి.

 

వైసీపీ వచ్చాక ఆ టెండర్లను 2019లో రద్దు చేసింది. తుంగభద్ర నుంచి నీటి లభ్యత సరాసరిన ఒక నీటి సంవత్సరంలో 60 రోజులు ఉంటుంది. ఈ 60 రోజుల్లో వచ్చే నీటిని రోజుకు కేవలం 2వేల క్యూసెక్కులను కేసీ కాలువకు వదులుతూ అదనంగా మరో 120 టీఎంసీల నిల్వకు మాత్రమే అవకాశముంది. 60 రోజుల నీటి లభ్యత తర్వాత కేసీ కాలువ ఆయకట్టుదారులు నీటి కోసం ప్రతీ సంవత్సరం ఉద్యమించాల్సి వస్తోంది. రైతులు తమ బాధలను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేసినపుడు పోతిరెడ్డిపాడు - బానకచర్ల ద్వారా నీళ్లను కేసీ కాలువకు ఇస్తున్నారు.