తాలిబన్ల చేతిలో ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల సంపద

Published: Wednesday August 25, 2021

ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ కోసం చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని అనుకుంటున్నారు. à°ˆ ఇండస్ట్రీకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. à°ˆ రంగానికి ప్రాణవాయువు వంటి లిథియం నిల్వలు అఫ్ఘాన్ భూభాగంలో ఉన్నట్లు మరెక్కడా లేవు. ఒక్క ఎలక్ట్రిక్ వాహనాల రంగమే కాదు, బ్యాటరీలు అవసరమయ్యే ప్రతిరంగానికీ లిథియం కీలకమే. à°ˆ ఖనిజ నిల్వలు అఫ్ఘాన్‌లో అపారం. అందుకే దీన్ని ‘సౌదీ అరేబియా ఆఫ్ లిథియం’ అని పిలుస్తారు. ఇక్కడున్న లిథియం నిక్షేపాల విలువ కనీసం వెయ్యి బిలియన్ డాలర్లు (1 ట్రిలియన్) ఉంటుందని అంచనా. ఇది మన లెక్కల్లో అయితే 74 ట్రిలియన్ రూపాయలన్నమాట.

అఫ్ఘాన్‌ భూభాగంలో అధిక మోతాదులో ఉన్న మరో ఖనిజం ఇనుము. ఇక్కడ à°Žà°‚à°¤ లేదనుకున్నా కనీసం 420 బిలియన్ డాలర్ల విలువైన ఐరన్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అఫ్ఘాన్‌లో ఉన్న కాపర్ నిక్షేపాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తే.. రష్యా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు à°Žà°—à°¿à°°à°¿ గంతేసి à°† దేశంతో చేతులు కలిపే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. అప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత కూడా రష్యా, చైనా అధికారులు అక్కడే ఉన్నారు. à°ˆ క్రమంలో తాలిబన్లు à°ˆ దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. à°ˆ ఉగ్రవాదులు కనుక చైనాకు మంచి ఆఫర్ ఇస్తే.. కేవలం రాగి తవ్వకాలతోనే ఏటా కొన్ని బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరుగుతుందని తెలుస్తోంది.