పట్టాలపై నడుస్తుండగా దూసుకెళ్లిన రైలు

Published: Sunday August 29, 2021

పవిత్ర జలాల కోసం తుంగభద్ర వద్దకు పాదయాత్రగా వెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో రైలు ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఆంజినేయ (19), శ్రీనివాసులు (20) మృతిచెందారు. సుమారు వందమంది రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఒళ్లు గగుర్పొడిచే à°ˆ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటాక కోసిగి మండల పరిధిలోని ఐరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఆస్పరి మండలం బినిగేని గ్రామస్థులు యేటా శ్రావణమాసం మూడో శనివారం గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి తుంగభద్ర నదీ జలాలతో అభిషేకాలు నిర్వహిస్తారు. నదీ జలాలను కాలి నడకన వెళ్లి తీసుకువస్తారు. ఇందుకోసం రానుపోనూ సుమారు 90 à°•à°¿.మీ. నడుస్తారు. à°ˆ వేడుక శనివారం ఉండటంతో గ్రామానికి చెందిన సుమారు 300 మంది బినిగేని నుంచి శుక్రవారం పాదయాత్రగా వెళ్లారు. నది వద్ద పూజలు నిర్వహించి, తుంగభద్ర జలాలను బిందెలలో తీసుకుని తిరుగు పయాణం ప్రారంభించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2 à°—à°‚à°Ÿà°² సమయానికి కోసిగి మండల పరిధిలోని ఐరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపానికి చేరుకున్నారు. అక్కడ మూడుమోర్ల బ్రిడ్జిల మీద కొందరు, రైల్వే ట్రాక్‌పై కొందరు నడుస్తుండగా ఎదురుగా రైలు వస్తున్న శబ్దం వినిపించింది. దీంతో పక్కనే ఉన్న మరో ట్రాక్‌ పట్టాలపైకి వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి వస్తున్న రైలును వారు గమనించలేదు. రైలు దగ్గరికి వచ్చే సమయంలో కొందరు గుర్తించి కేకలు వేస్తూ బ్రిడ్జి పైనుంచి కిందకు దూకేశారు. మరికొందరు తప్పించుకునే క్రమంలో కిందపడ్డారు. ఇంతలో రైలు కొందరిని ఢీకొంటూ దూసుకువెళ్లింది. చుట్టూ చీకటి, రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో అని గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందారు. అరుపులు కేకలు, ఆర్తనాదాలతో à°† ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. వచ్చిన వారిలో కొందరు కనిపించకపోవడంతో పట్టాలపై వెదికారు. బినిగేనికి చెందిన ఈరన్న, ఈరమ్మ దంపతుల కుమారుడు ఆంజినేయ.. తిమ్మప్ప, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీనివాసులు మృతదేహాలు కొంతదూరంలో కనిపించాయి. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో కనిపించారు. à°ˆ ప్రమాదం గురించి శనివారం ఉదయానికి బినిగేని గ్రామం అంతటా వ్యాపించడంతో గ్రామస్థులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సమీప గ్రామాల ప్రజలు సైతం అక్కడికి వచ్చారు. గ్రామస్థులు, మృతుల కుటుంబీకులు భోరున విలపించారు. వర్షాలు బాగా కురవాలని, తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఏటా ఆంజనేయ స్వామిని తుంగభద్ర జలాలతో అభిషేకిస్తామని, à°ˆ ఏడాది దుర్ఘటన చోటుచేసుకుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వంద మందికి పైగా రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్నామని బినిగేని గ్రామస్థులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు