చేతికి చిక్కిన పతకం కోల్పోయిన భారత్.

Published: Monday August 30, 2021

జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో చేతికి అందిన పతకాన్ని భారత్ కోల్పోయింది. నిన్న జరిగిన ఎఫ్-52 ఈవెంట్‌లో డిస్కస్ త్రో ఆటగాడు వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 19.91 మీటర్ల దూరం విసిరి ఆసియా రికార్డు కూడా సృష్టించి మరీ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే, వైకల్య వర్గీకరణ విషయంలో తోటి అథ్లెట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రంగంలోకి దిగిన నిర్వాహకులు ఫలితాలు నిలిపివేశారు. వర్గీకరణ ప్రక్రియను సమీక్షించిన అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని నిన్ననే ప్రకటించారు. 

 

తాజాగా, వినోద్ కుమార్ వర్గీకరణ ప్రక్రియను సమీక్షించిన నిర్వాహకులు వినోద్‌ కుమార్‌ను అనర్హుడిగా తేల్చారు. దీంతో భారత్ తన ఖాతా నుంచి à°“ పతకాన్ని కోల్పోయింది. బలహీన కండరాల శక్తి, అవయవ లోపం లేదంటే కాళ్ల పొడవులో తేడా ఉన్నవాళ్లు ఎఫ్-52 à°•à°¿à°‚à°¦ పోటీ పడే అవకాశం ఉంది. à°ˆ నెల 22నే వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన నిర్వాహకులు అథ్లెట్ల జాబితాను కూడా రెడీ చేశారు. అప్పుడా జాబితాలో వినోద్ కుమార్ పేరు కూడా ఉంది. దీంతో నిన్నటి పోటీలో పాల్గొన్న వినోద్.. 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడా వర్గీకరణను సమీక్షించిన నిర్వాహకులు వినోద్ కుమార్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో భారత్ à°“ పతకాన్ని కోల్పోయింది.