వడగాడ్పులతో పెరిగిన వేడిసెగలు...కోస్తా మండుతోంది

Published: Tuesday June 19, 2018

 à°¨à±ˆà°°à±à°¤à°¿ రుతుపవనాల సీజన్‌లో వడగాడ్పులు వీస్తున్నాయి. రోహిణి కార్తెలో ఉండే వేడి వాతావరణాన్ని రాష్ట్రం చవిచూస్తోంది. రుతుపవనాలు పూర్తిగా బలహీనం కావడం, పడమర గాలులు వీస్తుండడంతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ à°Žà°‚à°¡, అర్ధరాత్రి వరకు వేడి వాతావరణం, ఉక్కపోత కొనసాగుతున్నాయి. జూన్‌లో వర్షాలు తగ్గితే ఎండలు ఉండడం సాధారణమే. కానీ, à°ˆ ఏడాది మరింత ఇబ్బంది పెట్టేలా వడగాడ్పులు వీస్తున్నాయి. రాయలసీమ, తెలంగాణల్లో కూడా వానలు తగ్గినా కోస్తాతో పోల్చితే గాడ్పులు అంతగా లేవు. కోస్తాలో ఐదు రోజుల నుంచి గాడ్పులతో పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.