అలా చేస్తే తాలిబన్లకు మద్దతిస్తా

Published: Saturday September 04, 2021

తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎంతోమంది పారిపోయారు. వీరిలో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, మంత్రులు సహా మరెందరో ప్రముఖులు ఉన్నారు. అలాంటి వారిలో  à°† దేశ మాజీ డిప్యూటీ అంతర్గత శాఖ మంత్రి జనరల్ ఖోషల్ సదత్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన à°“ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆఫ్ఘనిస్థాన్ వచ్చి తాలిబన్లకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే, అందుకు à°“ షరతు విధించారు. తాలిబన్లు కనుక జాతీయ చిహ్నాలను, మహిళను గౌరవించి వారికి హక్కులు కల్పిస్తామని హామీ ఇస్తే తాను ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగుపెడతానని పేర్కొన్నారు.  

 

ఆఫ్ఘనిస్థాన్‌కు తిరిగి వచ్చేందుకు తాలిబన్లతో ఖోషల్ చర్చలు కూడా జరిపినట్టు ఆఫ్ఘన్ న్యూస్ ఏజెన్సీ à°’à°•à°Ÿà°¿ పేర్కొంది. ‘‘తాలిబన్లతో నేను మాట్లాడాను. జాతీయ గీతం, జాతీయ జెండా, మహిళల హక్కులు, వారి స్వేచ్ఛను గౌరవిస్తే  కనుక నేను తిరిగి దేశానికి వస్తాను. కొత్త ప్రభుత్వానికి నా మద్దతు ప్రకటిస్తా. ఆఫ్ఘన్ ఎయిర్‌ఫోర్స్, స్పెషల్ ఫోర్స్‌ను మళ్లీ గాడిలో పెడతా’’ అని ఖోషల్‌ అన్నట్టు పఝవోక్ ఆఫ్ఘన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

 

ఖోషల్ సదత్ దేశ పోలీస్ చీఫ్‌గానూ వ్యవహరించారు. బ్రిటన్ ఆఫీసర్ ట్రైనింగ్ కాలేజీ, అమెరికా ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ, శాండ్‌హర్స్ట్‌లోని రాయల్ మిలటరీ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన ఖోషల్ 2003లో స్పెషల్ ఫోర్సెస్‌లో చేరారు. ఆగస్టు 15à°¨ దేశాన్ని తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలోని ఇతర మంత్రుల్లానే ఆయన కూడా దేశం విడిచి పరారయ్యారు.