25 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం

Published: Tuesday June 19, 2018
తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఈనెల 25 నుంచి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని రైతులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంకలో రాష్ట్రవ్యాప్త రైతుప్రతినిధుల కీలక సదస్సు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా పెట్టుబడి రాయితీ రూ.10వేలు ఇవ్వాలని, రైతులకు రూ.8 లక్షల జీవితబీమా ప్రకటించాలని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అందించాల్సిన సహాయాలను వెంటనే విడుదల చేయాలని, వరిని రూ.2వేలకు తక్కువకాకుండా మద్దతుధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ రైతు ప్రతినిధులు తీర్మానించారు.
 
సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, రిటైర్డు డీజీపీ దినేశ్‌రెడ్డి, బీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు ముఖ్య అతిథులుగా à°ˆ సదస్సులో పాల్గొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వాలు గాలికొదిలేస్తే రానున్న రోజుల్లో à°† ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుందని జేడీ లక్ష్మీనారాయణ, దినేశ్‌రెడ్డి à°ˆ సందర్భంగా వ్యాఖ్యానించారు. రైతులు పోరాట స్ఫూర్తితో సంఘటితంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏమీలేదని సూచించారు. ఆల్డా చైర్మన్‌ యాళ్ల దొరబాబు, కోనసీమ రైతుసంఘ నాయకుడు యాళ్ల వెంకటానందం తదితరులు కూడా à°ˆ సదస్సులో పాల్గొన్నారు.