నార్వే ఎంబసీలో తాలిబన్ల దుశ్చర్య

Published: Thursday September 09, 2021

అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు లోపలున్న వైన్ సీసాలను పగలగొట్టి, పుస్తకాలను ధ్వంసం చేశారు. కాబూల్‌లోని తమ ఎంబసీని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని, à°† తర్వాత తిరిగి దానిని తమకు అందిస్తామన్నారని ఇరా‌న్‌లో నార్వే రాయబారి సిగ్వల్డ్ హాగ్ à°“ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎంబసీలోని వైన్ సీసాలను, పిల్లల పుస్తకాలను వారు ధ్వంసం చేశారని తెలిపారు. 

 

ఇటీవల తాలిబన్లు మాట్లాడుతూ తాము విదేశీ దౌత్య కార్యాలయాలు సహా సంస్థల జోలికి పోబోమని తెలిపారు. అయితే, అంతలోనే నార్వే రాయబార కార్యాలయంపై పడడం వారి మాటలకు, చేతలకు మధ్య పొంతన ఉండడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, మొన్న తాలిబన్లు ఏర్పాటు చేసిన మధ్యంతర ప్రభుత్వంలో అంతర్జాతీయ ఉగ్రవాది సిరాజుద్దీన్ హక్కానీ  అంతర్గతశాఖ మంత్రిగా ఉన్నారు.  త్వరలోనే హిబతుల్లా అఖుంద్‌జాదా సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.