అమ్మాయిలా కవ్వింఛి అబ్బాయికి వల ....

Published: Tuesday June 19, 2018
వారిద్దరూ ఒకే పాఠశాలలో చదివారు. ఇటీవలే పదో తరగతి పాసయ్యారు. సినిమాలు, సోషల్‌ మీడియా ప్రభావంతో వారిలో ఒకడు ఉచ్చు పరిచాడు. à°† ఉచ్చులో à°† రెండో విద్యార్థి ఇరుక్కున్నాడు. అమ్మాయిలా కవ్వించి, ఆనక బెదిరించి డబ్బులు లాగేసిన à°ˆ వ్యవహారంలో ఇద్ద రూ మైనర్లే కావడంతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయలేదు. విశాఖ ద్వారకానగర్‌లోని à°’à°• కార్పొరేట్‌ పాఠశాలలో బాధిత విద్యార్థి చదివాడు. అక్కడే నిందితుడితో పరిచయమైంది. ఒకరోజున బాధిత విద్యార్థి వాట్సా్‌పకు à°’à°• అమ్మాయి ఫొటోతో మెసేజ్‌ వచ్చింది. ‘ఐ లవ్‌ యూ’ అని కవ్వించింది. అయితే, à°† మెసేజ్‌ను తన సహ విద్యార్థే పంపాడని బాధిత విద్యార్థికి తెలియదు. తనపై అనుమానం రాకుండా అతడు పగడ్బందీగా వ్యవహరించాడు.
 
 
కొత్త నంబర్‌తో నిందితుడు వాట్సాప్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. à°† నంబరుతోనే మెసేజ్‌లు పంపేవాడు. ‘నువ్వంటే నాకిష్టం’.. ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ బాధి à°¤ విద్యార్థిని మొగ్గులోకి దింపాడు. à°ˆ క్రమంలో ఒకసారి ‘అబ్బాయిల నగ్న శరీరం చూడాలని నాకు కోరికగా ఉంది. నీ ఫొటోలు పంపుతావా?’ అంటూ బాధిత విద్యార్థికి మెసేజ్‌ వచ్చింది. దీనిపై అతడు తన నగ్న ఫొటోలను à°† నంబరుకు పంపించాడు. ఇక అక్కడినుంచి నిందితుడు బెదిరించడం మొదలుపెట్టాడు. ‘డబ్బులు పంపించు. లేకపోతే నగ్నంగా ఉన్న నీ ఫొటోలను నెట్‌లో పెట్టేస్తా’నని భయపెట్టాడు. దీంతో à°—à°¤ నెలరోజుల నుంచి నిందితుడు అడిగినప్పుడల్లా.. తన తల్లి పేటీఎం ఖాతా నుంచి డబ్బులు పంపుతున్నాడు. à°ˆ క్రమంలో ఒకసారి తన పేటీఎంలో రెండు వేలు తగ్గడంతో అతని తల్లికి అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీయడంతో తాను మోసపోయిన విషయం à°† బాధిత విద్యార్థి బయటపెట్టాడు.