జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేతపై..టంగ్‌ క్లీనర్‌ ఇవ్వాలి కదా!

Published: Thursday September 16, 2021

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న తన వ్యాజ్యాన్ని సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ త్వరలోనే హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ (అప్పీల్‌) వేస్తానని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఒకవేళ హైకోర్టులో కూడా తన కేసు గెలవకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేతకు సంబంధించి జగన్‌ మీడియా ముందస్తుగా చెప్పిందే నిజమైందని అన్నారు. బుధవారం సీబీఐ కోర్టు తీర్పు వెలువరించకముందు, తర్వాత ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్నా.. జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి కేసుల విషయంలో జాప్యం జరుగుతున్నా.. సీబీఐ ఎందుకు మౌనంగా వ్యవహరిస్తోంది? సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకపోవడం దారుణం. అయినా అంతిమ విజయం న్యాయానికే దక్కుతుందన్న నమ్మకం నాకుంది’ అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోవడంవల్లే నేరాల రేటు 63 శాతానికి పెరిగిపోయినట్లు చెప్పారు. నేరాలు, ఘోరాలు విచ్చలవిడిగా జరుగుతున్నా.. పోలీసులకు ఉత్తమ అవార్డులు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 

‘ఇంతవరకు మటన్‌, చేపలు, సినిమా టికెట్ల అమ్మకం అన్నారు. ఇప్పుడు వైఎస్సార్‌ చిరునవ్వు పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు చెబుతున్నారు. à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ పళ్లు తోముకోడానికి బ్రష్‌, టూత్‌పే్‌స్ట ఇస్తామంటున్నారు. అయితే నాలుక శుభ్రపరచుకోడానికి టంగ్‌ క్లీనర్‌ కూడా ఇవ్వాలి కదా! బహుశా à°† తర్వాత జగనన్న సుశ్వాస పేరుతో టంగ్‌క్లీనర్లు  ఇస్తారేమో’ అని రఘురామరాజు ఎద్దేవా చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ  ప్రజాసమస్యలు పట్టించుకోకుండా బిగ్‌బాస్‌ టీవీ ప్రోగ్రామ్‌ను బ్రోతల్‌ స్వర్గమంటూ వ్యాఖ్యానించడం తగదని చెప్పారు. ప్రజలకు వినోదాన్ని పంచే టీవీ కార్యక్రమాలపై దృష్టిపెట్టే కంటే ప్రజల సమస్యలపై దృష్టి  కేంద్రీకరిస్తే మంచిదని ఆయన వీరాభిమానిగా తాను చెబుతున్నానన్నారు. ఎంతో ప్రతిష్ఠాకరమైన చారిత్రక ఆంధ్రా లయోలా ఎయిడెడ్‌ కాలేజీని ప్రభుత్వం సొంతం చేసుకోవాలని నిర్ణయించడం బాధాకరమని తెలిపారు. à°† కాలేజీలో ఎందరో మహానుభావులు చదువుకున్నారన్నారు. ఐదో తరగతి తెలుగు పుస్తకంలో మేరీమాత, చర్చిలు, మతాలను ప్రేరేపించే అంశాలను చేర్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందూ ఎస్సీలుగా ఉంటూ రిజర్వేషన్లు, సౌకర్యాలు అనుభవిస్తూ.. క్రైస్తవులుగా మతమార్పిడి చేసుకున్న తర్వాత కూడా  రిజర్వేషన్లు అనుభవించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని రఘురామరాజు వ్యాఖ్యానించారు.