మృతిచెందిన వారి కార్డుల్లో సచివాలయ ఉద్యోగుల పేర్లు

Published: Sunday November 07, 2021

చనిపోయిన వ్యక్తుల కార్డుల్లో పేర్లు నమోదు చేసుకొని... వాటిని సరెండర్‌ చేస్తున్నట్లు చూపుతున్న ఘటన దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామ సచివాలయంలో వెలుగులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగులే à°ˆ అక్రమానికి పాల్పడడం గమనార్హం. రేషన కార్డులను సరెండర్‌ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. దీనిపై గ్రామ సర్పంచి, స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. ఇంగిలాపల్లి గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వజ్రపు రవికుమార్‌ స్వగ్రామం మెంటాడ మండలం పెదమేడపల్లి. ఆయనకు స్వగ్రామంలో రేషన కార్డు ఉంది. అందులో తన పేరును తీసేసి... దత్తిరాజేరు మండలం గదబవలస గ్రామానికి చెందిన జొన్నాడ నారాయణమ్మ (ఇటీవల మృతిచెందిన) రేషన్‌ కార్డులో తనపేరును నమెదు చేశాడు. అనంతరం à°† కార్డును సరెండర్‌ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇదే కార్డులో మెంటాడ మండలం పోరాం గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వజ్రపు సురేష్‌ కూడా తన పేరును నమెదు చేసి కార్డును సరెండర్‌ చేసినట్లు చెబుతున్నాడు. రవికుమార్‌, సురేష్‌ బంధువులు కావడంతో ఇద్దరూ మాట్లాడుకుని ఒకే కార్డులో పేర్లు నమోదు చేసి అనంతరం కార్డును సరెండర్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంగిలాపల్లి గ్రామ సచివాలయంలోనే గ్రేడ్‌-5 కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బూర రామచంద్రరావుది విజయనగరం. ఆయన కూడా గదబవలస గ్రామ పంచాయతీ చినచామలాపల్లికి చెందిన బమ్మిడి రాములమ్మ (మృతిచెందింది) రేషన్‌ కార్డులో తన పేరును నమోదు చేసి కార్డును సరెండర్‌ చేసినట్లు చెబుతున్నాడు. వీటన్నింటినీ గుర్తించిన ఇంగిలాపల్లి సర్పంచ్‌ విజయలక్ష్మి, గర్బాపు శ్రీను కలిసి ఎంపీడీవో ఎంవీ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ à°Ž.సులోచనారాణికి శనివారం ఫిర్యాదు చేశారు. రేషన కార్డుల్లో అక్రమాల విషయాన్ని తహసీల్దార్‌ వద్ద ప్రస్తావించగా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతారని చెప్పారు. నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.