పెరిగిన పంపిణీ, సరఫరా నష్టాలు

Published: Saturday November 13, 2021

తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కట్టె పట్టుకొని మరీ వివరించారు! దానిని సవాల్‌à°—à°¾ తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రత్యేకంగా దృష్టి సారించారు! అదే సమయంలో, 2014 తర్వాత విద్యుత్తు రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి! విద్యుత్తు లభ్యత భారీగా పెరిగింది! ఎక్కడ అందుబాటులోకి వస్తే అక్కడ కొనుగోలు చేశారు! అన్ని వర్గాలకూ నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేశారు! దీనిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విజయంగా ఘనంగానే అన్ని వేదికలపైనా చెప్పుకొంటున్నారు! విద్యుత్తు వినియోగంలో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామని చెబుతున్నారు! విజయం నిజమే! కానీ, దాని వెనక విషాదమూ నిజమే! ప్రజలకు వెలుగులు పంచుతూ డిస్కమ్‌లు చీకట్లలో మగ్గిపోతున్నాయి! రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్ఠలు తెస్తూ.. అవి దివాలా దిశగా అడుగులు వేస్తున్నాయి.

 

ఏటా వచ్చే ఆదాయంలో 85 శాతానికిపైగా కరెంటు కొనుగోళ్లకే సరిపోతోంది. మిగిలిన మొత్తం అప్పులకు వడ్డీలు, జీతభత్యాలకు సరిపోతోంది. వెరసి, ఏటేటా డిస్కమ్‌లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. 2014-15లో వాటికి కేవలం రూ.2,281 కోట్ల నష్టాలు ఉండగా.. 2020 మార్చి 31 నాటికి రూ.42,292 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనం.

 

ఇళ్లు, పరిశ్రమలతోపాటు వ్యవసాయానికీ 24 గంటలూ విద్యుత్తు ఇవ్వాలంటే పెద్ద ఎత్తున కొనుగోళ్లు తప్పనిసరి. నిజానికి, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థాపిత సామర్థ్యం పెద్దగా పెరగలేదు. తెలంగాణ వచ్చినప్పుడు స్థాపిత సామర్థ్యం 5,403మెగావాట్లు ఉంటే.. ఇప్పుడు అది6,215 మెగావాట్లకు పెరిగింది. అంటే, ఏడున్నరేళ్లలో పెరిగిన స్థాపిత సామర్థ్యం 812 మెగావాట్లు మాత్రమే. కానీ, విద్యుత్తు వినియోగం మాత్రం భారీగా పెరిగిపోయింది. 2014 మార్చిలో ఉమ్మడి రాష్ట్ర డిమాండ్‌ 13,162 మెగావాట్లు కాగా.. 2020 ఫిబ్రవరి 28à°¨ ఒక్క తెలంగాణలో డిమాండ్‌ 13,168 మెగావాట్లు. ఇక, 2013-14లో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 39,764 మిలియన్‌ యూనిట్లు. కాగా.. 2019-20లో తెలంగాణలోనే వినియోగం 59,005మిలియన్‌ యూనిట్లు. ఇళ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి 24గంటలూ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే ఇందుకు కారణం. దాంతో, నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు భారీగా కొనుగోలు చేయక తప్పలేదు. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కరెంటు కొనుగోళ్లు రూ.20,908 కోట్లు మాత్రమే. కానీ, 2019-20 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి కేవలం కొనుగోళ్లకే రూ.36,233 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది (ప్రభుత్వ థర్మల్‌, హైడల్‌ ప్రాజెక్టులతో పాటు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన విద్యుత్తు కూడా కలిపి).

 

డిస్కమ్‌à°² వార్షిక ఆదాయ నివేదికల్లోనే à°ˆ విషయం స్పష్టం చేశారు. ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌) పరిధిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌ ఆదాయం రూ.24,131కోట్లు కాగా.. కరెంట్‌ కొనుగోళ్లకు 24,837 కోట్లు ఖర్చు చేశారు. à°† ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే డిస్కమ్‌ మూటగట్టుకున్న నష్టాలు రూ.4,967 కోట్లు. ఇక, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎన్పీడీసీఎల్‌ ఆదాయం రూ.10,570 కోట్లు కాగా... à°• రెంట్‌ కొనుగోళ్లకే రూ.10,921 కోట్లు పెట్టారు. 2018-19లో రూ.3,051 కోట్లు, 2019-20లో రూ.1,116 కోట్ల నష్టాన్ని ఎన్పీడీసీఎల్‌ చవిచూసింది. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం పెద్దగా పెరగకపోవడంతో అనివార్యంగా కొనుగోళ్లకు బహిరంగ విపణికే వెళ్లాల్సి ఉంటుంది. ఓపెన్‌ యాక్సె్‌సలో కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు రూ.10చొప్పున కూడా కొనుగోలు చేసింది. రెప్ప వాల్చకుండా కరెంటు ఇస్తున్నామనే రికార్డుల కోసం డిస్కమ్‌లు ఆర్థికంగా కుదేలయ్యాయి. ఖరీదైన కరెంటును సరఫరా చేస్తూ చాలీచాలని ఆదాయాన్ని మూటగట్టుకుంటున్నాయి.

 

డిస్కమ్‌à°² నష్టాలు రూ.42 వేల కోట్లు

డిస్కమ్‌లు పోటీ పడి నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. 2014-15లో రూ.2,512కోట్ల నష్టాలే ఉండగా.. 2019-20ముగిసేనాటికి రూ.33,046కోట్లకు చేరుకున్నాయని వార్షిక నివేదికల్లో డిస్కమ్‌లు పేర్కొన్నాయి. 2020-21తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ నష్టాలు మరో రూ.9000కోట్లు ఉంటాయని విద్యుత్తు శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా, మొత్తం నష్టాలు రూ.42వేల కోట్లకుపైమాటేనని చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, వినియోగం పెరిగే కొద్దీ 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక నష్టాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇందులో వ్యవసాయ విద్యుత్తు వాటా à°’à°•à°Ÿà°¿ కాగా.. జీతాలు, నిర్వహణ వాటా మరికొంత. జీతభత్యాల వ్యయం ఏడున్నరేళ్లలో భారీగా పెరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగుల జీతభత్యాలను రెండు దఫాలుగా 67 శాతం పెంచారు. ఫలితంగా, 2013-14లో ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌)లో ఉద్యోగుల జీతభత్యాల వ్యయం రూ.852.72 కోట్లు ఉండగా.. 2019-20 నాటికి రూ.2,134.44 కోట్లకు చేరుకుంది. ఎన్పీడీసీఎల్‌ (వరంగల్‌) పరిధిలో రూ.725 కోట్ల నుంచి 1429.65 కోట్లకు చేరింది

డిస్కమ్‌లు స్వయంగా వెల్లడించిన వార్షిక నివేదికల ప్రకారం.. ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే డిస్కమ్‌లు రూ.6,061 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక, ఇదే ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మొత్తం నష్టాలు రూ.42,292 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో, దక్షిణ డిస్కమ్‌ (ఎస్పీడీసీఎల్‌) వాటా రూ.29,303 కోట్లు! ఉత్తర డిస్కమ్‌ (ఎన్పీడీసీఎల్‌) వాటా కేవలం రూ.12,983 కోట్లు. పంపిణీ, సరఫరా నష్టాలను తగ్గించుకోవాలని ఉదయ్‌ పథకంలో చేరినప్పుడే కేంద్రం సూచించింది. కానీ, ఏటికేడాది à°ˆ నష్టాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. పంపిణీ, సరఫరా నష్టాలను ఎన్పీడీసీఎల్‌లో 2016-17లో 11.90శాతానికి, 17-18లో 10.95 శాతానికి, 18-19లో 10శాతానికి తగ్గించాలని కేంద్రం సూచించింది. కానీ, 2015-16లో ఎన్పీడీసీఎల్‌లో 12.84శాతం పంపిణీ, సరఫరా నష్టాలు 2017-18లో 25.29 శాతానికి, 2019-20లో 36.34 శాతానికి చేరాయి. 2016-17లో ఎస్పీడీసీఎల్‌లో 12.6 8శాతానికి, 2017-18లో 11.3శాతానికి, 2018-19లో 9.9 శాతానికి తగ్గించాలని సూచించగా.. పెద్దగా పెరగలేదు.