హఠాత్తుగా భూమిలో నుంచి నీళ్ళ ట్యాంకు

Published: Sunday December 05, 2021

హఠాత్తుగా భూమిలో నుంచి నీళ్ళ ట్యాంకు దానంతట అదే పైకి పొడుచుకు వచ్చింది. ఇంకోచోట నీళ్లు పడలేదని ఒదిలేసిన బోరుబావి కేసింగ్‌ పైపు 30 అడుగుల ఎత్తు నిటారుగా లేచి నిలబడింది. అనేక ఊళ్లలో ఉండి ఉండీ భూమిలోంచి వింత శబ్దాలు వస్తున్నాయి. భూమి కంపిస్తోంది. పలు ప్రాంతాల్లో ఒట్టిపోయిన బోర్లు కూడా విచిత్రంగా మోటార్లతో పనిలేకుండానే నీళ్లను ఎగజిమ్ముతున్నాయి. రెండువారాల à°•à°¿à°‚à°¦ జిల్లాను అతలాకుతలం చేసిన కుండపోత వానల తర్వాత జరుగుతున్నఈ వింతలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

జిల్లాకు దక్షిణ సరిహద్దుల్లో 15-20 కిలోమీటర్ల చేరువలోని వేలూరులో à°—à°¤ సోమవారం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.6à°—à°¾ నమోదైంది. దీని ప్రభావమో కాదో తెలియదు కానీ గుడిపాల మండలం కిలారివారిపల్లెలో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.భూమిలోపలి నుంచీ పెద్దపెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన గ్రామస్తులు ఇళ్ళ నుంచీ వీధుల్లోకి పరుగులు తీశారు. రోజూ ఏదో వేళ à°ˆ శబ్దాలు ప్రజల్ని భయపెడుతూనే ఉన్నాయి. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ బలిజపల్లెలో కూడా పది రోజుల క్రితం భూమిలో నుంచీ పెద్దఎత్తున శబ్దాలు వచ్చాయి. పలమనేరు మండలం కరడిమడుగు గ్రామంలో à°—à°¤ నెల 27à°¨ రాత్రి భూమి కంపించింది. శబ్దాలు రావడంతో జనం ఇళ్ళ నుంచీ బయటికి పరుగులు తీశారు. ఐరాల మండలం అబ్బుగుండులో భూమి నుంచీ వింత శబ్దాలు వచ్చాయి. పూతలపట్టు మండలం తుంబవారిపల్లెలో పదిరోజుల కిందట భూ ప్రకంపనలు వచ్చాయి. గోడలు బీటలు వారడంతో పాటు గ్రామానికి చేరువగా వున్న చెట్లు విరిగిపడ్డాయి. దానికితోడు à°† ప్రాంతంలో బోర్ల నుంచీ నీరు పైకి ఉబికివస్తోంది. రామకుప్పం మండలంలో à°—à°¤ వారం భూప్రకంపనలు సంభవించాయి. బందార్లపల్లె,పంద్యాలమడుగు, గొరివిమాకులపల్లె పంచాయతీల పరిధిలోని పది పల్లెల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళన చెంది ఇళ్లనుంచి బయటి కొచ్చారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుపతి శ్రీకృష్ణనగర్‌ జలమయమైంది. అక్కడ à°’à°• ఇంటి ఆవరణలోని నీళ్ళ సంపు హఠాత్తుగా భూమిలోంచి బయటకు పొడురుకు వచ్చింది. à°† ఇంటి మహిళ à°—à°¤ నెల 25à°µ తేదీన ట్యాంకు లోపలికి దిగి శుభ్రం చేస్తుండగా సిమెంటు వరలతో కూడిన à°† ట్యాంకు పైకి లేవడం మొదలు పెట్టింది. దాదాపు 11 అడుగులు భూమి పైకి పొడుచుకువచ్చింది.  

 

నిండ్ర మండలం కత్తెరవేడు గ్రామంలో దరొస్వామినాయుడు అనే రైతు నగరి-నాగలాపురం ప్రధాన రహదారి పక్కనే తమ పొలంలో నాలుగు నెలల కిందట బోరు బావి డ్రిల్‌ చేయించారు. నీరు పడకపోవడంతో కేసింగ్‌ పైపు దింపి ఉపరితలంపై దానికి క్యాప్‌ బిగించి వదిలిపెట్టేశారు. à°—à°¤ సోమవారం à°ˆ కేసింగ్‌ పైపు భూఉపరితలం దాటి 30 అడుగుల ఎత్తుకు లేచి నిలబడింది. 

వి.కోట పట్టణం కీలపల్లి చెరువు ఆయకట్టు భూముల్లో మోటర్లతో నిమిత్తం లేకుండా వ్యవసాయ బోర్ల నుంచీ నీరు ఉబికి వస్తోంది. అదే మండలం ఎర్రినాగేపల్లి, దండికుప్పం గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీ లాభాల గంగమ్మ గుడి వద్ద ఏకంగా 20 అడుగుల ఎత్తుకు ఫౌంటెన్‌లా బోరు నుంచీ నీరు ఎగిసిపడ్డాయి. తంబళ్ళపల్లె మండలం మల్లయ్యకొండ à°•à°¿à°‚à°¦ నీరు లేదని వదిలేసిన వ్యవసాయ బోరు నుంచీ నీరు వెలుపలికి దుమికింది. à°† ఒత్తిడికి కేసింగ్‌ పైపుకు అమర్చిన క్యాప్‌ కూడా ఊడిపోయింది. అదే మండలం నాయనప్పగారిపల్లెలోనూ బోరు నుంచీ నీరు పైకి చిమ్ముతున్నాయి. చౌడేపల్లె మండలం సింగిరిగుంటలో వ్యవసాయ బోర్ల నుంచీ నీరు విరజిమ్ముతోంది. ఇక రామచంద్రాపురం మండలంలోని పలు బావుల్లో నీటి మట్టం భూ ఉపరితలానికి సమాంతరంగా పెరిగింది.

‘‘చెరువులు, వాగులు ప్రవహించే చోట్ల నివాస ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇలాంటి చోట్ల నేల చాలా వదులుగా ఉండే అవకాశం ఉంది. భూగర్భజలాలు పెరిగి ఒత్తిడికి గురైనపుడు భూమి కుంగి పోవడం కానీ, పైకి ఉబ్బడం గానీ జరగవచ్చు. భూమి లోపల ఉన్న వస్తువులు పైకి రావడం, నీళ్ళు ఉబికి రావడం వంటివి ఇందువల్లే జరుగుతున్నాయి. ఇక భూగర్భ జలాలు పెరగడం వల్లనే బోర్లలో వాటంతటవే నీళ్ళు పైకి ఎగజిమ్ముతున్నాయి. భూమిలోపలి నుంచీ వచ్చే శబ్దాలకు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూకంపాలనేవి మన ప్రాంతంలో ఏర్పడే అవకాశం à°Žà°‚à°¤ మాత్రమూ లేదు. వేసవి తీవ్రతకు భూమి లోపల తడి ఆరిపోతుంటుంది. భారీ వర్షాలు కురిసినపుడు భూమి పొరల్లో నీరు నిండిపోతుంది. à°ˆ క్రమంలో భూమిలో కొంత వరకూ కదలికలు సంభవిస్తాయి. శబ్దాలు రావడం జరగొచ్చు. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురవడం, దానికి తగ్గట్టుగా భూగర్భ జల మట్టాలు పెరగడమే à°ˆ పరిణామాలకు ప్రధాన కారణం.’’