షార్ట్‌ సర్క్యూట్‌తో వ్యాన్‌ దగ్ధం

Published: Wednesday December 08, 2021

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం సిద్ధాపురం సమీపంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా థర్మాకోల్‌ షీట్లను తరలిస్తున్న ఒక ఐషర్‌ వ్యాన్‌ బుధవారం దగ్ధమైంది. ఏలూరు నుంచి సిద్ధాపురం రోడ్డులోని ఐస్‌ ఫ్యాక్టరీకి థర్మాకోల్‌ షీట్లను తరలిస్తుండగా సిద్ధాపురం రైల్వేగేటు దాటిన తర్వాత వంతెన ఎక్కుతుండగా వ్యాన్‌లోని షీట్లకు విద్యుత్‌ వైర్లు తగలడంతో షార్ట్‌ సర్క్యూట్‌ అయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ తప్పించుకోగా వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.19.5 లక్షలు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.