పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు

Published: Friday June 22, 2018

 à°¤à°¿à°°à±à°®à°²à°²à±‹ శ్రీవారి గులాబీ వజ్రం, పలు నగలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురువారం ఆసక్తికమైన ట్వీట్లు చేశారు. టీటీడీ నగలు కొన్నేళ్ల క్రితం ప్రత్యేక విమానంలో విదేశాలకు ఎగిరిపోయాయని తనకు తెలుసని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలకు కూడా à°ˆ విషయం తెలుసని తెలిపారు. ‘టీటీడీ నగల అదృశ్యంపై కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ విమానాశ్రయం లాంజ్‌లో à°“ ఐపీఎస్‌ అధికారి కొన్ని ఆసక్తికర విషయాలు నాకు చెప్పారు. నాటి ప్రతిపక్ష టీడీపీ నేతలకూ à°ˆ విషయాలు తెలుసు. à°† నగలు à°“ ప్రైవేటు విమానంలో à°“ మధ్య ప్రాచ్య దేశానికి ఎగిరిపోయాయని à°† ఐపీఎస్‌ నాకు చెప్పారు. అందుకే రమణదీక్షితులు ఆందోళన వ్యక్తంచేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. వేంకటేశ్వరస్వామి మూగవాడని.. దోచుకున్నా ఫర్వాలేదని దొంగలు అనుకుని ఉంటారు. రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు రాష్ట్రప్రభుత్వ జవాబులు సంతృప్తికరంగా లేవు. à°“ భక్తుడు విసిరిన నాణెం తగిలి గులాబీ వజ్రం ఎలా ముక్కలైందో ఫోరెన్సిక్‌ నిపుణులతో సీన్‌ రిక్రియేట్‌ ఎందుకు చేయించరు? చేయిస్తే నిజాలు వెలికి వస్తాయి’ అని పవన్‌ తన ట్వీట్లలో ప్రశ్నించారు.